విలన్ హస్బెండ్-30

Sravani Naramala

Author

కుమారి అమర్ ను చూసి సిగ్గు పడుతూ కిచెన్ లోకి పరిగెత్తడం చూసిన ఆద్య నవ్వుకుంటూ ప్లాన్ సక్సెస్ పాప సో ఇపుడు నువ్వు హ్యాపీనా అంటూ మాన్య వైపు చూస్తుంది…. హ్యాపీ అని చిన్నగా అడుగుతావ్ ఏంటి అమ్ము పిచ్చ హ్యాపీగా ఉన్నాను లెట్స్ డ్యాన్స్ అంటూ పిచ్చిగా ఎగురుతూ తమ హ్యాపీనెస్ ను అలా సెలెబ్రేట్ చేసుకుంటారు…..

ఏంట్రా ఇది ఆ పిల్ల ఏంటి నాకు ఇచ్చిన సాసర్ లో ఐ లవ్ యూ అని రాసుంది పైగా అది పర్టికులర్ గా నాకే ఇచ్చింది అని వెర్రి మొహం వేసుకుని అడుగుతున్న అమర్ ను చూసి నాకు అదే అర్థం కావడం లేదు అమర్ అని తల తిప్పి చూసిన జై కి ఆద్య, మాన్య డ్యాన్స్ చేస్తూ కనిపిస్తారు…. రేయ్ డౌబ్ట్ లేదు ఆ దెయ్యాలే ఏదో చేశాయి ఆగు దాని పని చెప్తా అని కోపంగా ఆద్య వైపు వెళ్తాడు వెనుకే అమర్ కూడా ఫాలో అవుతాడు….