అన్వేష్ మెట్ల మీద ఉండగానే పైన ఉన్న చీకటి గదులలో నుండి వింత వింత శబ్దాలు వినిపిస్తున్నాయి… అవి కేవలం శబ్దాలు కావు… ఎవరో గొంతు నొక్కినట్టు ఆక్రందనలు, గోళ్లతో గోడలను గీకుతున్నట్టు వికృతమైన అరుపులు
ఆ అరుపులు ఆందోళన భయం పరిధి దాటిపోయింది ఆ అరుపులు గుండెల్ని పిండేస్తున్నాయి…. ఇక లాభం లేదనుకుని, అసలు పైన ఏముందో చూడాలనే ధైర్యంతో అన్వేష్ ఫోన్ టార్చ్ లైట్ పట్టుకుని మెట్ల వైపు నడిచాడు
పాత చెక్క మెట్లపై అడుగు పెట్టగానే, ‘” క్రీచ్ ” అంటూ వచ్చిన శబ్దం ఆ నిశ్శబ్దంలో బాంబులా పేలింది…అతని గుండె వేగం పెరిగింది