ఇక్కడ నాకేం తెలియదు కదా… ఒక ఫ్రెండ్ గా మీరు నాకు దగ్గరుండి జాతర చూపిస్తారా ?? అని అడుగుతాడు అన్వేష్
ఆ ప్రశ్నకి ఆన్సర్ ఏం చెప్పాలో తెలియలేదు తనకి చిన్నప్పటి నుంచి తాతయ్యకి తెలియకుండా ఎక్కడికి వెళ్ళలేదు అలాగని తాతయ్యకి చెప్తే వెళ్ళనిస్తారని గ్యారెంటీ లేదు
ఎందుకంటే నువ్వు ఒక అమ్మవారి బిడ్డవి కాబట్టి నీకు కొంచెం ప్రమాదం ఉంటుంది అని చెప్పి తనని ఎక్కడికి తీసుకువెళ్లరు కేవలం ఆ ఇల్లు గుడి చుట్టూ ఉన్న అరణ్య ప్రాంతం ఇదే తన ప్రపంచం