** అజేయ – 28 **
అదే సమయం లో..పైకి అత్యంత మోడ్రన్ గా, ప్రాక్టికల్ గా, మరియు ఎమోషన్స్ లేని ఒక బిజినెస్ ఉమెన్‌లా కనిపించే సియా…
ఆ పెయింటింగ్ వైపు చూస్తున్నప్పుడు ఆమె లోపల ఒక వింతైన అలజడి మొదలైంది.. సియా మైండ్ లోకి తను ప్రొట్రైట్ వేస్తున్నప్పటి ఆ విజువల్స్ తన కళ్ళ ముందు కనిపిస్తుంటే..ఒక తెలియని గందరగోళం సియా మనసులోకి దూసుకొచ్చింది..
ఒక ప్రొఫెషనల్ పెయింటర్‌గా ఆమెకు రంగుల మీద, బ్రష్ స్ట్రోక్స్ మీద పూర్తి కంట్రోల్ ఉంది. కానీ, ఈ నిర్దిష్టమైన చిత్రాన్ని గీసేటప్పుడు మాత్రం ఆమె చేతులు ఆమె ఆధీనంలో వుండవు..