** అజేయ – 31 **
సియా తన ఎడమచేతిని నెమ్మదిగా తన గుండెపై వేసుకకొగా.. ఆమె హార్ట్ రేట్ పెరగడం ఆ లాంజ్ నిశ్శబ్దంలో ఆమెకు క్లియర్ గా సెన్స్ అవుతోంది..
అది ఈ కాలానికి చెందిన బాధ కాదు… యుగాల క్రితం, ఏనాడో అర్థాంతరంగా ఆగిపోయిన తన ప్రేమ కథ తాలూకు ఒక అంతులేని విరహం , ఒక అంతుచిక్కని వేదన!
పైకి ఎంత ప్రాక్టికల్ గా బతికేస్తున్నా… తన ఆత్మ లోపల ఒక పెద్ద శూన్యాన్ని తను మోస్తోందని ఆమెకు అర్థమైంది..
కాన్వాస్ మీద ఆ ‘అజేయ’ ఖడ్గాన్ని పట్టుకున్న ఆ వీరుడి ముఖాన్ని తను గీయలేకపోవడానికి కారణం… ఆ ఫేస్ తన కళ్లముందు రియల్‌గా నడుచుకుంటూ రావాలని తన ఇన్నర్ సోల్ కోరుకుంటోంది..
ఆమె కళ్ల కోణాల్లో ఒక చిన్న కన్నీటి చుక్క మెరిసింది. ఐప్యాడ్ స్క్రీన్‌ను లాక్ చేసిన సియా