చింత చచ్చిన పులుపు చావలేదు అన్నట్టు కాలు నొప్పిగా ఉన్నా ఈవిడ పొగరు చూపించడం మాత్రం మానరు అనుకుంటూ అదేం లేదు పెద్ద అమ్మ గారు మీకు నొప్పిగా ఉందేమో రెస్ట్ తీస్కుంటారేమో అని అడిగా అని లోపలికి వెళ్లి పోతుంటే ఏయ్ ఎక్కడకే వెళ్తున్నావ్ అని కోపం గా అడిగింది…
లోపలికి పెద్ద అమ్మ గారు అని స్వర్ణ సమాధానం ఇస్తే… లోపల నీ బాబు సంపాదించిన ఆస్థులు ఏమైనా ఉన్నాయా??? టైం టూ టైం మాత్రం తిండి లోపలికి వెళ్ళాలి … తిన్న తిండి కి న్యాయంగా కానీ ఒక్క పని కూడా చేయరు ఈ అమ్మ కూతుళ్లు… వెళ్ళు వెళ్లి ఆ గార్డెన్ లో పనులు చూడు అని గదిమింది…
ఆవిడ అనే మాటలకి బాధగా సమాధానం ఏమ్ ఇవ్వకుండా బయట గార్డెన్ లో పనులు చేస్తుంటేనే వస్తాడు ఇంద్ర స్నేహితుడు ధర్మ…
గార్డెన్ పనులు చేస్తున్న స్వర్ణ ని చూసి నువ్వు గార్డెన్ పనులు చేయడం ఏంటి అని అడిగితే మన ఇంట్లో పనులు మనం చేయడంలో తప్పేంటి ధర్మ గారు అంటుంది…