అంతా నువ్వే అని తెలిసి కూడా మళ్ళీ నీతో ఏమ్ చెప్పాలి… తను ఎలా బాధ పడుతుందో చెప్పాలా లేక తన కన్నీళ్ల వీడియో తీసి నీకు సెండ్ చేయాలా… అయినా స్వర్ణ అంటే నీకెందుకురా అంత కోపం అని నిలదీసాడు ధర్మ…
ఆ మాటలు విని కూడా పట్టించుకోకుండా మళ్ళీ ఎప్పుడు నీ ప్రేమ విషయం స్వర్ణ కి చెప్పలేదా అని అడిగాడు
తన గురించి తెలిసాక తన మీద ఉన్న అభిమానం మరింత పెరిగింది.. నా ప్రేమ విషయం చెప్తే జాలిగా భావిస్తుందే కానీ ప్రేమ అనుకోదు అందుకే చెప్పకుండా తనకి ఏదైనా సహాయం చేయాలి అనిపించి.. మనీ ఇస్తే ఆత్మభిమానం ఉన్న ఆడపిల్లగా తీసుకోదు కాబట్టి మరెలా హెల్ప్ చేయాలా అని ఆలోచించి అని ఆగిపోయాడు…
హా ఆలోచించి అని ధర్మ వైపు చూశాడు ఇంద్రజీత్..