స్వర్ణ ఆచూకీ తెలిసిందా అని అడిగారు..
సెర్చ్ చేయిస్తున్న మా! తను ఎక్కడికి వెళ్లిందో అర్థం అవట్లేదు అని బాధగా తల దించుకుని చెప్పాడు..
కూతురు ఇల్లు వదిలి పోయిందని తెలియని రాజేశ్వరి గారు… స్వర్ణ ఆచూకీ తెలియడం ఏంటి వదినా? ఇంద్ర వెతికిస్తున్న అంటున్నాడు న్ నా కూతురికి ఏమైంది అని కంగారుగా అడిగారు రాజేశ్వరి గారు..
రాజీ! ఏమ్ అవ్వలేదు నువ్వు కంగారు పడకు…. ముందు నువ్వు ఆ కంగారు తగ్గించుకోని ఇలా కూర్చో అని సోఫాలో కూర్చోబెట్టారు దేవయాని గారు…