శ్రీరామ్, ఇంద్ర ఇద్దరు వచ్చేసాక ఇంద్ర ని చూడగానే గుండె లోతుల్లో గాయాలు ఇంకా సెగలు పుట్టిస్తూనే ఉన్నా మనసు పడిన వాడిని చూడగానే ఆ మంటలన్నీ ఒక్కసారిగా చల్లబడిపోయాయి ఎంతైనా మనసు పడిన వాడు కదా! ఎన్ని రోజులు దూరంగా ఉన్నా ఎంత వేదన అనుభవించినా.. మనసు పడిన వాడి రూపాన్ని చుసినందుకు మనసు కాస్త కుదుట పడింది…
ఎదకి నువ్వే గాయమైతే మందు కూడా నువ్వేనా
మనసు నిన్ను మరవ బోతే కళ్ళు నిను వెతికేనా
గాయ పరిచిన వాడిని చూస్తే ద్వేషం రావాలి కానీ విచిత్రంగా స్వర్ణలో అనుమానం మొదలయింది…
కసిగా చూడాల్సిన ఆ కళ్ళల్లో కనికరం కనిపిస్తోంది… ఎందుకలా? ఇన్నిరోజుల తర్వాత ఇంద్రని చూడటం వల్ల నా కళ్లకు అలా భ్రమ కలుగుతోందా? లేక నిజంగానే ఇంద్ర మారిపోయాడా?