అతడి ఇబ్బంది మొహం లో కొట్టొచ్చినట్టు కనిపిస్తుంటే నువ్వు కూర్చో బాబు అని మెయిడ్ ని పిలిచి కాఫీ తెప్పిస్తుంది…
తలనొప్పి అంటే ఫాస్ట్ గా వెళ్లి స్వర్ణ తెస్తుంది అనుకున్నాడు…
ఆశలు నిరాశలు చేస్తూ మెయిడ్ సన్నీ కి ఇంద్ర కి కాఫీ తీసుకు రావడంతో ఓ సిప్ తాగి అదో రకంగా ఫేస్ పెట్టి రోజు మీరు ఇదే తాగుతున్నారా బామ్మా అన్నాడు..
స్వర్ణ చేతి కాఫీ కి అలవాటు పడ్డ భానుమతి గారికి ఈ ఎదవ మరాఠి మేళలాకి వంట చేయడమే కాదు కాఫీ పెట్టడం కూడా సరిగా రాదు అని అనసూయ గారు అంటే అబ్బాహ్ బామ్మా అర్జెంట్ గా తలనొప్పి మాయం అయ్యేలా ఏమ్ చేయాలో చెప్పవా అని దీనంగా అడిగాడు ఇంద్ర..