పన్నెండవ భాగం
కళా బండి ఎక్కి నాతో చెప్పు నైట్ వచ్చాడా మా అన్నయ్య అని నన్ను ఆటపట్టిస్తున్నట్టు గా అడిగింది
నేను అర్ధమయినా కానట్టు ఏ అన్నయ్య ఎవరికి అన్నయ్య అని అన్నాను
కళా నా వీపు మీద ఒక్కటేసి వేషాలు వేయకు నేను ఏమి అడిగానో నీకు తెలుసు సమాధానం చెప్పు అంది
అబ్బా చంపేసావే రాక్షసి అంత గట్టిగా కొట్టావ్ అయిపోయావే నా చేతిలో బండి ఆపనీ నేను చెప్తా నీ పని అని నేను అంటుంటే
కళ ఏమో కొంపతీసి అన్నయ్యతో చెప్తావా చెప్పకే తల్లి నా ఫోటోకి దండా నాకు పిండం రెండు పెట్టేస్తాడు అసలే మా అమ్మ నాన్నకి ఒక్కటే కూతుర్ని అలాగే నీకు కూడా ఉన్న ఒకటే ఫ్రెండ్ నీ కదా నా మీద కాస్త జాలి చూపించవే అని తన గోల అది చెప్తూ పోతుంది కళా డైవర్ట్ అయిందని అది చాలు అనుకొని నేను సైలెంట్ గా డ్రైవ్ చేస్తూ కాలేజీ రాగానే ఆపాను