పదహరవ భాగం
నేను ఫ్రెష్ అయ్యి కిందకు వచ్చేటప్పటికి నాధ్ ఇంకా ఛోటు అలాగే కామాక్షి గారు డైనింగ్ టేబుల్ దగ్గర ఉన్నారు. కానీ కళ కనిపించలేదు నేను అడిగేలోపే నాధ్ కళ గెస్ట్ రూమ్ లో ఉంది వస్తుంది నువ్వు కూర్చో అన్నాడు నేను కూర్చోగానే కళ వచ్చి నా పక్కన కూర్చుంది
నాకు ఏదురుగా నాధ్ కూర్చుంటే కామాక్షి గారు వడ్డిస్తున్నారు. నేను ఆకలి వల్ల గమనించలేదు కానీ కళ నా చెవిలో అన్ని నీకు ఇష్టమైన ఉన్నాయేంటే ఎప్పుడు చెప్పావు మా అన్నతో అంది
అప్పుడే చూశాను నేను నిజమే గోంగూర పచ్చడి మామిడికాయ పప్పు దొండకాయ తాలింపు సాంబార్ టమోటా రసం అన్ని నాకు నచ్చినవే అవన్నీ చూసి నాధ్ వైపు చూశాను తను తింటున్నాడు కళ మాత్రం పక్కనుంచి రాత్రి చెప్పావు కదూ అర్థమైంది లే ఇది ప్రీ ప్లాన్డ్ అంటూ నేను చెప్పనవసరం లేదని అదే సమాధానం ఊహించుకొని తినడం మొదలుపెట్టింది
తినకుండా నేను ఎలా తెలుసు అనే ఆలోచనలో ఉన్న నాకు కింద నాకు కాలు నీ నాధ్ తన కాలితో తట్టాడు తల ఎత్తి చూసిన నాతో తిను అని చెప్పాడు
అప్పుడే ఎవరో తెలియలేదు నాధ్ బేటా ఏం చేసావ్ ఈరోజు నువ్వు నేను వాడిని బెదిరించమంటే ఒక కాలు చేయి విరిచేశావు చెప్పిన పని చేయవా ఏంటి రా నువ్వు అంటూ లోపలికి వచ్చారు