దెబ్బకి ఆమె చేతిలో ఉన్న ఫోన్ జారి బెడ్ మీద పడిపోయింది..ఆ ఫొటోస్ వంకే చూస్తూ నో ఇవి నిజం కాదు నిజం కాదు అంటూ తల తిరుగుతుండగా బెడ్ మీద కూలబడిపోయింది….
ఆద్య అంత షాక్ అయ్యేలా ఏం చూసింది అనేగా మీ డౌట్ చెప్తా..
రాఖీ తను వేరే అమ్మాయితో క్లోజ్ గా ఉన్నప్పుడు సగం బట్టలతో, అసలు లేకుండా కూడా కొన్ని ఫొటోస్ తీపిస్తాడు…అలా తీసిన ఫొటోస్ లో తన ప్లేస్ లో దిలీప్ ఉన్నట్టుగా ఫొటోస్ ని మార్ఫింగ్ చేయిస్తాడు…
అండ్ తను మాట్లాడిన కొన్ని మాటలను దిలీప్ మాట్లాడుతున్నట్టుగా మార్ఫింగ్ చేసి వీడియో తీపిస్తాడు..
ఆ మాటలు ఏంటంటే దిలీప్ తో ఫోటోల్లో కలిసున్న అమ్మాయి దిలీప్ ని గట్టిగా కిస్ చేసి వదులుతు ఏంటి బేబీ నువ్వు నన్ను కాదని నీ మరదల్ని పెళ్ళి చేసుకోవడానికి రెడీ అవుతున్నావంటా..
ఏంటి మేటర్ … నేనే నీ ప్రాణం అన్నావ్.. నేను నాతో ఇలా ఏకాంత సమయం గడపితే ఇంకేం అవసరం లేదు అన్నావ్..అలాంటిది అప్పుడే నీకు నేను బోర్ కొట్టేసానా అందుకే మరదలితో పెళ్ళికి ఒప్పుకున్నావా..