** అజేయ – 66 **
ఆ చీకటి ఆమెను ఒక జీవశ్చవంలా మింగేస్తున్నట్లు అనిపించింది.. ఉన్నట్టు ఉండి సియా భయం తో..”రాఘవ్! వద్దు.. వద్దు రాఘవ్! మనం వెనక్కి వెళ్ళిపోదాం!”
అంటూ.రాఘవ్ జాకెట్‌ను రెండు చేతులతో గట్టిగా పట్టుకుని వెనక్కి లాగడానికి ప్రయత్నిస్తోంది..
సియా గొంతులో విపరీతమైన భయం, వణుకు స్పష్టంగా తెలుస్తున్నాయి..
రాఘవ్ పానిక్ అవుతున్న సియా నీ చూస్తూ..”బేబీ .. రిలాక్స్, ప్లీజ్ కూల్ డౌన్,” అంటూ.. రాఘవ్ టార్చ్ లైట్‌ను కిందకు తిప్పి, సియా ముఖంపై కాంతి పడకుండా చూస్తూ తనని కూల్ ప్రయత్నించాడు..
“లేదు రాఘవ్! ఇది అస్సలు సేఫ్ కాదు. చూడు.. ఆ తలుపు దానంతట అదే మూసుకుపోయింది. ఇది ఒక డెడ్ ట్రాప్ లా వుంది..