ఆ క్షణం శాన్వికి తన గుండె చప్పుడు కంటే… క్రిష్ గుండె చప్పుడు ఇంకా స్పష్టంగా వినిపిస్తోంది… ఒక్కసారిగా తన కళ్లేత్తి క్రిష్ కళ్ళ లోకి చూస్తూ… అతని దగ్గర నుండి వస్తున్న ఘాటైన పర్ఫ్యూమ్ వాసనని గుండెల నిండుగా పీల్చుకుంటూ తనకి తెలియకుండానే రెండు చేతులతో క్రిష్ భుజాలను గట్టిగా పట్టుకుంది…
ఆ పట్టుకి క్రిష్ ఒక్కసారిగా విధిలించి శాన్వి కళ్ళ లోకి సూటిగా చూస్తూ నిలబెట్టాడు
క్రిష్ కళ్ళు నిప్పు కణికల్లా మెరుస్తుంటే ఆ చూపుకి జడిసిన శాన్వి తల దించుకుంది…
ఇది కారిడర్ అనుకుంటున్నావా??? లేక ప్లే గ్రౌండ్ అనుకుంటున్నావా??? ఎదుటి వాళ్ళని గుద్దుకుంటూ వెళ్ళిపోతున్నావ్ అని అడిగాడు…
నేనేం మీకు కావాలని డాష్ ఇవ్వలేదు… పొరపాటు గా చూసుకోకుండా వచ్చి మీకు తగిలాను అంది..
హ్మ్!! మార్నింగ్ కూడా నేనేం కావాలని బురద చల్లలేదు పొరపాటునా పడిందేమో అని ఎందుకు అనుకోలేదు అని అడిగాడు…