New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
కన్నుల్లో నీ రూపం – 4

కన్నుల్లో నీ రూపం – 4

రేయ్ అభి ఏంటిరా ఇంతా లేటు ఫోన్ చేద్దాం అంటే నువ్వు ఫోన్ చెయ్యకు అన్నావు అని మెసేజ్ చేశాను.

 

హ థాంక్స్ రా అందరు వచ్చారా ఇంకా స్టార్ట్ చేద్దామా.

 

అయ్యో అభి వాడు రాలేదు కదా ఇప్పుడు ఒక్కరు తగ్గారు ఏల రా 

 

అన్నా నేను మీతో ఆడుకోవచ్చా అన్నా వోయిస్ కి అందరు వాయిస్ వచ్చిన వైపు చూశారు.

 

రేయ్  ఎవడ్రా నువ్వు నిన్ను ఎప్పుడు ఇక్కడా చూడలేదు.

 

 

హ అన్న నా పేరు శివ  మేము ఈ మధ్య ఇక్కడకి వచ్చాము నాకు క్రికెట్ అంటే చాలా ఇష్టం ప్లీజ్ నన్ను మీతో కలిపించుకోండి.

 

 

అభి శివ నీ ఒక్కసారి చూసి సరే రా అని శివ వాళ్ళ తో జట్టు తో కలుపు కున్నారు.

 

అలా 3  గంటలు ఆడుకొని అప్పటికి  టైమ్ నాలుగు అవ్వడం తో రేయ్ 4 అయింది. మళ్ళీ రేపు ఆడుదాం అని  అభి అందరికి బై చెప్పి   తన బైక్ దగ్గిరకి వెళ్ళాడు.

 

శివ కూడా అభి వెనుక వచ్చి అన్న ఇంటికే వెళుతున్నావా.  ( ఈ శివ ఏవరో మీకు తెలుసా )

 

శివ ఒక్కసారి  చూసి అవును రా అని బైక్ ఎక్సలెంట్ర్ రేస్ చేశాడు. 

 

 

అయితే  నన్ను కూడా మా ఇంటి దగ్గిరా డ్రాప్ చెయ్యవా.

 

హ్మ్ సరే రా అని అభి తన ఫ్రెండ్స్ కి బై చెప్పి బైక్ స్టార్ట్ చేశాడు.

 

రేయ్ బుడ్డిగా ఏమ్ చదువుతున్నావురా 

 

నేనా అన్నా ఇంటర్ చదువుతున్నా 

 

 

ఒకే 

 

మీరు ఉండేది మా కాలనీ లోనా నన్ను ఎప్పుడైనా చూశావా రా

 

హ అన్నా నిన్ను నేను రోజు చూస్తూంటేనే గా 

 

ఏంటిరా నన్ను రోజు చూస్తున్నావా ఏంటి కొంపదీసి నాకు ఏమైనా సైట్ కొడుతున్నావా ఏంటి.

 

 

అయ్యో అన్నా నేను ఏందుకు నీకు సైట్ కొడతాను నువ్వు మా ఇంటి ముందు నుండే   మీ ఇంటికి వెళ్ళాలి అంతే కాదు నువ్వు ఎక్ససైజ్ చేస్తున్నాడు కూడా కనిపిస్తావు అన్నా.

 

హో అవునా నిన్ను నేను ఎప్పుడు చూడలేదు రా సరే   మన కాలనీ  వచ్చింది మీ ఇళ్ళు ఎక్కడా రా 

 

అదిగో అన్నా అక్కడా షాప్ ఉంది కదా అక్కడే 

 

హో శివ చెప్పినా ప్లేస్ లో బైక్ స్టాప్ చేశాడు.

 

 

శివ బైక్ దిగి థాంక్స్ అన్నా మేము ఉండేది ఇక్కడే ఈ మధ్య నే వచ్చాము ఈ షాప్ మా అక్క దే 

 

అప్పుడు గుర్తు వచ్చింది అభి కి జీవన ఈ షాప్ లోకి వెళ్లడం.

 

అక్క నా 

 

హ అన్నా మా అక్కే మీరు మా అక్కని కూడా చూసి ఉండరు లే

 

హ్మ్మ్ అని నవ్వి సరే బాయ్ నువ్వు ఓన్లీ సండే నే గేమ్ కి రా  ఇలా కాలేజీ ఉన్నప్పుడు వస్తే తోలు తీస్తాను అర్ధం అయిందా అని వార్నింగ్ ఇచ్చాడు అభి.

 

అయ్యో అన్నా నేను కాలేజీ డుమ్మా కొట్టి రాలేదు ఆట నేను గవర్నమెంట్ కాలేజీ లో చదువుతున్నా   8  to 1 ఉంటుంది అంతే క్లాస్ అందుకే వచ్చాను అన్నా 

 

హో సారీ రా నువ్వు డుమ్మా కోట్టి వచ్చావు ఏమో అని తిట్టాను ఏమ్ అనుకోకు సరేనా బై అని జీవ షాప్ వైపు చూసి ఇంట్లో కి వెళుతున్నా శివ నీ పిలిచి 

 

మీ అక్క పేరు ఏంటిరా 

 

మా అక్క పేరు నా అని అనుమానం గా చూశాడు అభి నీ.

 

రేయ్ నువ్వు అలా చూడక్కర్లే మీ అక్క పేరు చెప్పితే మా అమ్మా కి చెప్పుతాను మీ  అక్క షాప్ కి వెళ్ళమని 

 

హో అవునా జీవన అన్నా మా అక్క పేరు 

 

జీవన 

 

హ అన్నా నాన్న తనకి ఇష్టం గా పెట్టుకున్నా పేరు 

 

 

హో సరే అభి కి ఫోన్ రావడం తో శివ కి బై చెప్పి తను ఇంటికి వెళ్ళిపోయాడు.

 

ఇంట్లో కి వచ్చినా అభి నీ చూసి ఏంటి ఈ రోజు వెళ్లడం లేదా 

 

హ అమ్మా వెళుతున్నా అని ఫాస్ట్ గా రెడీ అయ్యి వాళ్ళ అమ్మా ఇచ్చిన కాఫీ తాగి తన మేనకోడలు ముద్దు చేసి తన బైక్ మీద తన వర్క్ చేసే డీ మార్ట్ కి వెళ్ళాడు.

 

హీరో అభి కి ఒక గోల్ ఉంది అది రీచ్ అవ్వాలి అంటే టైం పడుతుంది. తనకి కూడా ఎక్స్పీరియన్స్ ఉంటుంది అని డీ మార్ట్ లో క్యాష్ కౌంటర్ లో పార్ట్ టైం జాబ్ చేస్తున్నాడు.

 

 

కాలేజీ కి వెళ్లిన జీవ కి తన కాలేజీ అయిపోవడం తో కాలేజీ నుండి బస్ స్టాప్ వైపు నడిచింది.

 

జీవ ఫ్రెండ్ నళిని హేయ్ జీవ ఆగవే నేను వస్తున్నా అని జీవ కోసం పరిగెత్తి జీవ తో కలిసి నడుస్తూ ఏంటే జీవ ఈ రోజు ఇలా మూడీగా కనిపిస్తున్నావు.

 

నీకు ఏందుకు అలా అనిపిస్తుంది నేను బానే ఉన్నా 

 

అచ్చా అంతా లేదు అమ్మా నువ్వు ఏందుకో బాధ పడుతున్నట్టు కనిపిస్తున్నావు 

 

నీ మొఖం లే నీకు సైట్ పెరిగింది ఏమ్ పోయి చూయించుకో   నా బస్ వచ్చింది నేను వెళుతున్నా అని తను వెళ్లే దారిలో  డీ మార్ట్ దగ్గిరా బస్ దిగింది.

 

 

కాలేజీ బ్యాగ్ భయట వాచ్మెన్ కి ఇచ్చి   తన పరస్ తీసుకోని లోపల కి వెళ్ళింది.

 

 

క్యాష్ కౌంటర్ లో ఉన్నా అభి దగ్గిరా లైన్ ఎక్కువగా ఉండడం తో అభి నీ జీవ చూడలేదు.

 

 

తను కావలిసిన వి తీసుకుంటూ ఉన్నా జీవ కి ఎవ్వరో చిన్నా పాప కనిపిస్తే తనని ఆడిస్తూ ఉంది.

 

 

ఆ పాప తల్లి  పాపని వెతుకుంటూ రావడం పాప నీ తల్లి కి ఇచ్చి పాప గిఫ్ట్ గా నీ ముద్దు లు ఇచ్చి తన  షాపింగ్ లో పడింది.

 

తన బడ్జెట్ బట్టి ఇంట్లో కి కావలిసిన వి తీసుకుంటూ ఒక చోట ఆగిపోయింది తన కన్ను  తన తండ్రి ఉన్నప్పుడు కాలేజీ నుండి ఇంటికి వెళ్ళేటప్పుడు ఇంటికి కావలిసినవి తీసుకోడానికి వచ్చి తన తండ్రి తో ఇష్టం డైరీమిల్క్ చాక్లెట్ కొన్నిచుకొని తిన్నడం గుర్తుకు వచ్చి కన్నీళ్లు పెట్టుకుంది.

 

ఎవరైనా చుస్తే మళ్ళీ బాగోదు అని కళ్ళు తుడుచుకొని ఆ చాక్లెట్ ఫ్రిడ్జ్ దగ్గిరకి వెళ్ళి చాక్లెట్ తీసుకోని తన బస్కెట్ లో వేసుకోని బిల్ కౌంటర్ కి వెళ్ళింది.

 

జీవ ముందు ఐదు మంది ఉండడం తో అభి కనిపించలేదు ఇందాక తను ఆడుకున్నా పాప తన ఎదురు ఆడుతూ ఉండి ఏదురుగా ఉన్నా అభి నీ చూడనే లేదు.

 

 

అభి మాత్రం బిల్ వేస్తూ లైన్ లో ఏంత మంది ఉన్నారు అని చూస్తున్నప్పుడు జీవ కనిపించి ఒక క్షణం చూపు జీవకి వదిలేసి మళ్ళీ వెంటనే తేరుకొని బిల్ వేస్తూ నే ఒక కంటితో జీవ నీ చూస్తున్నాడు.

 

 

పాప వాళ్ళ అమ్మా    బిల్ కూడా అయిపోవడం తో జీవ దగ్గిరా నుండి తీసుకోని జీవకి థాంక్స్ చెప్పి వెళ్ళిపోయింది.

 

జీవ కూడా పాప కి బాయ్ చెప్పి బిల్ కౌంటర్ వైపు చూపు తిప్పే సరికి అభి నీ చూసి అక్కడే ఆగిపోయింది.

 

 

అభి కూడా జీవని చూస్తూ నవ్వుకున్నాడు.

 

జీవ వెనుక ఉన్నా వాళ్ళు జీవ నీ పిలిచే సరికి జీవ అభి దగ్గిరా కి వెళ్ళి తన చేతిలో ఉన్నా బస్కెట్ నీ అభికి ఇచ్చింది.

 

 

జీవ ఇస్తున్నా బస్కెట్ తీసుకోని బిల్ వెయ్యడానికి ముందు జీవ ఫోన్ నెంబర్ అడగడం తో  అభి నీ చూడకుండానే  నెంబర్ చెప్పింది.

 

జీవ చెప్పినా విధానం కి నవ్వుకొని  బిల్ వేసి అమౌంట్ చెప్పడంతో జీవ మనీ తీసి కౌంట్ చేసి ## మనీ తగ్గడం తో అభి వైపు చూసి ఆ చాక్లెట్ తీయిమని చెప్పింది.

 

జీవ చెప్పిన దానికి జీవ కళ్ళలోకి చూసి చాక్లెట్ నీ బిల్ లో రిమూవ్ చేసి  జీవ దగ్గిరా నుండి మనీ తీసుకోని బిల్ రిస్పీట్ జీవకి ఇచ్చాడు

 

 

ఇంకా ఉంది.

 

 

తప్పులు ఉంటే క్షమించండి.