New Katha Varnika is now on Google Play — read Telugu stories on your phone. Learn more
కన్నుల్లో నీ రూపం – 3

కన్నుల్లో నీ రూపం – 3

జీవన బస్ కోసం చూస్తూ అక్కడే ఉన్నా బెంచ్ మీద కూర్చొని నీ ఉంది తనకి ఏందుకో చాలా అలజడి గా ఉంది ఉదయం అభి నీ చూసినప్పుడే తనకి అలానే అనిపించింది. మళ్ళీ ఇప్పుడు తనకి అలా అనిపించడం తో భయంగా ఉంది చెప్పాలి అంటే టైం 12 అవ్వడం తో   ఆ స్టాప్ లో వాళ్ళు ఇద్దరే ఉన్నారు.

జీవన కి ఇప్పుడు అభి వచ్చి తనతో మాట్లాడితే తను ఏమ్ చెయ్యాలి అని చేతులు నలుపుకుంటూ   ఒరగా అభి నీ చూస్తూ ఉంది.
జీవన ఫేస్ ఎక్సప్రెషన్ చూసి నవ్వు కున్నాడు అభి.
ఒరగా అభి చూస్తున్నా జీవ కి అభి నవ్వడం చూసి  తలదించుకొని  ఓసేయ్ ఏమ్ అయిందే నీకు ఏందుకు అయినా వైపు అలా చూస్తున్నావు అని తనకు తను తిట్టుకునే పని లో పడింది.
10 నిముషాలు తర్వాత బస్  వస్తూ కనిపించడం తో బస్ కోసం  అభి బైక్ మీద  కూర్చొని ఉన్నవాడు కాస్త లేచి కొంచెం ఏదురు కి వస్తున్నాడు.
తల దించి ఉన్నా జీవ  అభి వైపు చూస్తూ ఉంది  అభి లేచి నుర్చోడం తో జీవకి కంగారు మొదలై చేతుల్లో చమట పడుతూ ఉండం స్టార్ట్ అయింది.
అభి మాత్రం బస్ స్టాప్ దగ్గిరకి వచ్చి ఆగడం తో బస్ లో దింగే తన అక్క కోసం చూస్తూ ఉన్నాడు కొంతమంది దిగిన తర్వాత తన అక్క ఒక చేతితో 5 ఏళ్ల తన కూతురు నీ పట్టుకొని ఇంకో చేతో లగేజ్ పట్టుకొని దిగింది 
తన మేనకోడలు నీ  నా బంగారం  తల్లి అని  ఎత్తుకొని  బుగ్గ మీద ముద్దు పెట్టుకోని తన అక్కనీ చూసి 
ఎలా ఉన్నావ్ అక్క 
బాగున్నాను రా నువ్వు ఏలా ఉన్నావు 
నేను బాగున్నా అవును బావ ఏలా ఉన్నారు బావ రాలేదు ఏంటి.
బావ బాగున్నాడు  బావ లీవ్స్ లేవు  నేను రెండు రోజుల్లో  వెళ్ళిపోతాను రా అమ్మకి హెల్త్ బాలేదు కదా శ్రావణమాసం వస్తుంది  ఇళ్ళు శుభ్రం చెయ్యాలి కదా అయినా  ఎంగేజ్మెంట్ కూడా దగ్గిరలో ఉంది కదా అప్పుడు వచ్చి కొన్ని రోజులు ఉంటాను.
అవునే మీ ఇంట్లో అయిపోయిన పనులు మరి హ మీ బావ నేను అత్తయ్య కలిసి చేసేసాం ఇక్కడ నువ్వు కాస్త సహాయం చేస్తే నేను రెండు రోజుల్లో చేశాయిచ్చు మరి ఏమ్ అంటావు.
సరే రా ఇంటికి వెళ్ళి మాట్లాడుకుందాం అని తన అక్క చేతిలో ఉన్నా బ్యాగ్ కూడా తీసుకోని తన బైక్ దగ్గిరకి వెళ్ళాడు.
అబ్బా దాని  ఇవ్వురా 
అబ్బా పర్లేదు లే నా బంగారం అని తన మేనకోడలు నీ మళ్ళీ బుగ్గ మీద ముద్దు పెట్టి బైక్ మీద కూర్చో పెట్టి తన అక్క నీ కూర్చోమని బైక్ స్టార్ట్  చేసి తన అక్క కూర్చొన్నా తర్వాత  ఒక్కసారి కూడ జీవ వైపు చూడకుండా అక్కడ నుండి వెళ్ళిపోయాడు.
ఇక్కడ తెలియని విషయం ఏంటి అంటే  అభి  బైక్ మీద నుండి లేగిచిన దగ్గిరా నుండి అభి అక్క రావడం వాళ్ళు మాట్లాడుకోవడం బైక్ మీద తన అక్క మేనకోడలు నీ తీసుకోని వెళ్లడం చూస్తూనే ఉంది.
అభి బైక్ కనిపించే వరుకు చూస్తూనే ఉంది ఇంతా లోపు తన బస్ రావడం తో  బస్ ఎక్కి సిట్లో కూర్చొని అభి నీ చుసిన దగ్గిరా నుండి తనకి ఎందుకు చూడాలి అనిపిస్తుందో తన మనుసుని అడగ గా తన మనసు  అభి నీ చూసి క్రష్ ఫీల్ అవ్వుతున్నా అని చెప్పాడం తో తన ఇంటి పరిస్థితి కి  ఇది కరెక్ట్ కాదు అని  ఆలోచించి  అభినీ మనుసులోకి రానివ్వకుండా ఉంచు అని తన బ్రెయిన్ హెచ్చరించడం తో కళ్ళు మూసుకొని ఏదో నిర్ణయం తీసుకున్నా దానిలా కళ్ళు తెరిచి బస్ కిటికీ లోనుండి  భయటకి చూస్తూ ఉంది.
అభి తన అక్క నీ ఇంటికి వచ్చి బ్యాగ్ రూమ్ లో పెట్టి తన మేనకోడలు తో కొంచెం సేపు ఆడుకుంటున్నాడు.
రేయ్ అభి నీ కోడలు తో తర్వాత ఆడుకుందువు గాని రా భోజనం తిందువు గాని…
హ అమ్మా వస్తున్నాం అని తన మేనకోడలు చేత హేండ్స్ క్లిన్ చేయించి తను హేండ్స్ క్లిన్ చేసుకోని  హాల్లో  ఉన్నా డైనింగ్ టేబుల్  దగ్గిరకి వచ్చాడు.
ఏయ్ ఏంటే తిండి కూడా మావయ్య తో ఆడుతున్నావా 
అవును మా మాముతో ఆడుకుంటున్నా మామ నీ నేను చాలా మిస్ అయ్యాను అని అభి ఒడిలో నే సెటిల్ అయింది.
నువ్వు ఇటురా నేను తినిపిస్తాను మావయ్య నీ తిన్నానివు 
నువ్వు వద్దు నాకు మా మావయ్య  నే తినిపిస్తాడు ఏ మామ నువ్వు నాకు తినిపించవా బుగ్గ మీద చెయ్యి పెట్టుకోని అడిగింది.
ఏందుకు తినిపించాను నా బంగారం కి నేనే తినిపిస్తాను అని తన మేనకోడలు తినే విలుగా అన్నం కూర కలిపి తినిపిస్తూ అమ్మా  డాడీ కి  బాక్స్ పట్టుకొని వెళ్ళారు కదా 
హ మీ నాన్న పట్టుకోని వెళ్ళారు సూకన్య మీ ఇంట్లో అందరు బానే చూసుకుంతున్నారా 
హ అమ్మా బాగా చూసుకుంటున్నారు అత్తయ్య అయితే చాలా బాగా చూసుకుంతున్నారు.
అయినా అమ్మా వచ్చిన అప్పుడు అలా ఏందుకు ఇలా అడుగుతున్నావు 
నా భయం నాది తల్లి.
అవును అమ్మా మొన్న నేను తెచ్చినా బ్లోజ్ కుట్టిస్తాను అన్నావు కుట్టించావా.
హ కుట్టించాను ఈ సారి నీకు నచ్చే విధంగా కుట్టించాను.
అవునా మొన్న అత్తయ్య డ్రెస్ లు శారీస్ తీసుకుంది అవి కూడా తీసుకువచ్చాను ఇవి ఇప్పుడు ఇస్తే  అప్పుడు ఇస్తారు 
అదేం లేదే  నేను @@దగ్గిరా ఇవ్వలేదు కొత్త గా ఒక అమ్మాయి కూడుతుంది 
అభి తన మేనకోడలు కి తినిపిస్తూ తను తింటూ అమ్మా అక్క మాటాలు వింటున్నాడు.
ఎప్పుడు అయితే దేవి గారు కొత్త అమ్మాయి అనేసరికి తన ద్యాస అంటా వాళ్ళు మాట్లాడుకునే దాని మీదే ఉన్నాడు.
కొత్త అమ్మాయి నా ఎవరు అమ్మా 
ఏమ్మోనే తెలియదు మెయిన్ రోడ్ మీద షాప్ పెట్టింది పెట్టి కూడా 3 నెలలు అయింది అనుకుంటా నీ బ్లౌజ్ ఈ రోజు ఇవ్వమని చెప్పాను ఉదయం తీసుకోని వచ్చింది 
అవునా బాగా కుట్టిందా అమ్మా అని తను తిన్నడం అవ్వడంతో మార్నింగ్ జీవ తెచ్చిన కవర్ సోఫా లో ఉండడం తో దాని లో బ్లౌజ్ చెక్ చేస్తూ ఉంది.
అభి చిన్నీ ది కూడా లంచ్ అవ్వడంతో  తన మేనకోడలు నీ సోఫా లో కూర్చోపెట్టి కిచెన్ లో ఉన్నా ఫ్రిడ్జ్ దగ్గిరకి చిన్ని కోసం ఐస్క్రీమ్ తీసుకోని రావడం తో దాని తీసుకోని తన అక్కకి  ఇచ్చి తన మేనకోడలు కి తినిపిస్తున్నాడు.
తమ్ముడు ఇచ్చిన ఐస్క్రీమ్ తింటూ రేయ్ ఇప్పుడే చెప్పుతున్నా దానికి ఐస్క్రీమ్ చోక్లేట్స్ పెట్టకు పోయినా సారి నువ్వు పెట్టడం వల్ల దానికి హెల్త్ పాడైంది.
హ సర్లే ఈ ఒక్కసారి కే లే అని తను కూడా చిన్ని కి పెడుతు ఐస్క్రీమ్ తిని   తన ఫోన్ కి వచ్చిన మెసేజ్ చూసి చిన్ని మూతి క్లీన్ చేసి ఇప్పుడు పొడుకో ఈవ్నింగ్ మనం పార్క్ కి వెళదాం అని చిన్ని కి ముద్దు పెట్టి తను మార్నింగ్ వేసిన డ్రెస్ చేంజ్ చేసుకోని సుకన్య కి దేవి గారికి  చెప్పి  బైక్ తీసుకోని తన అడ్డా కి భయాలుదేరాడు.
రేయ్ అభి ఏంటిరా ఇంతా లేటు ఫోన్ చేద్దాం అంటే నువ్వు ఫోన్ చెయ్యకు అన్నావు అని మెసేజ్ చేశాను.
హ థాంక్స్ రా అందరు వచ్చారా ఇంకా స్టార్ట్ చేద్దామా.
అయ్యో అభి వాడు రాలేదు కదా ఇప్పుడు ఒక్కరు తగ్గారు ఏల రా 
  అన్నా నేను మీతో ఆడుకోవచ్చా అన్నా వోయిస్ కి అందరు వాయిస్ వచ్చిన వైపు చూశారు.
ఇంకా ఉంది.
తప్పులు ఉంటే క్షమించండి.