“ఒరేయ్ అవేం మాటలు రా.. అమ్మ చెప్తుంది కూడా నీ గురించే కదా,నీ మంచి గురించి ఆలోచించే కదా..” అని అంది శోభ శ్రీపాదని చూస్తూ.
“నేను మాట్లాడుతుంది మా అమ్మతో పెద్దమ్మా నీతో కాదు..” అని అన్నాడు ఇంక నువ్వు ఆపు అన్నట్టుగా శోభాని చూస్తూ శ్రీపాద.. తనకి తెలుసు పెద్దమ్మ మాటలు విని ఆ మాటలని తమ మీద ప్రయోగిస్తుంది అమ్మ అని,ప్రతిసారి జరిగేది అదే కదా మరి కొత్తగా ఏముంది.
“నీ భార్యకి నాకు పోలిక ఏంటి రా..! మీకు పెళ్లి అయ్యి 11 సంవత్సరాలు అవుతుంది ఇప్పటికీ పిల్లల కోసం నానా తిప్పలు పడుతున్నారు హాస్పటల్లు గూడులు అంటూ తిరుగుతూ.
నేను కనీసం చేతులు ఎత్తి మొక్క కుండానే పెళ్ళి అయిన సంవత్సరంలోపు నువ్వు పుట్టావు.” అని అంది కచ్చాగా పద్మ.. ఇంట్లో భార్యని పెట్టుకొని ఎదురుగా పెద్దమ్మని పెట్టుకొని తనని తక్కువ చేసి మాట్లడుతున్నాడు కొడుకు అని తన కోపం.