తన కొడుకుని మార్చింది,తన కొడుకుని తనకి కాకుండా చేసింది అని మనసులో నాటుకుపోయిన్న పద్మ..”చూసావా అక్క నంగనాచి తుంగ బుర్రల చేసేవి అన్ని చేసి ఇప్పుడు తలదించుకొని ఎంత బాగా వెళుతుందో..ఎవరైనా చూస్తే ఇది ఎంత అమాయకురాలో అనుకుంటారు.
పులిలా ఉండే నా కొడుకుని పిల్లిలా దాని వెనక తిప్పుకుంటుంది టక్కులాడి.” అని అంది మనసులో ఉన్న కోపాన్ని ఎలా బయట పెట్టాలో తెలియక మాటల రూపంలో బయట పెడుతూ.
రూమ్ లోకి వెళ్లి తలుపు వేసుకోబోతున్న శైలుకి ఆ మాటలు వినిపించి ఇంకా బాధని కలిగించాయి.
అసహనంగా బెడ్ మీద కూర్చున్న శ్రీపాదకి కూడా వినిపించాయి.. వినిపించిన వెంటనే బెడ్ మీద నుంచి కోపంగా పైకి లేచాడు.
శ్రీపాదాని చూసి టక్కున డోర్ లాక్ చేసి భర్తని గట్టిగా పట్టుకొని బెడ్ మీద కూర్చోబెట్టి..” ప్లీజ్ ఇంకా దీనిని పెద్దగా చేయొద్దు.