New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
కలియుగ మ(మా)యసభ – 48

కలియుగ మ(మా)యసభ – 48

“చిన్న అత్తయ్య మాటలకి బాధపడుతూనే.. శాంతి నా అశ్రద్ధ వల్లనే ఇలా అయిపోయింది,ఇప్పుడు పోయిన ప్రాణాన్ని ఎలాగో తీసుకురాలేను..తల్లి కడుపుకోతని ఎలాగో నేను తీర్చలేను కనీసం ఉపశమనమైన ఇవ్వాలి అని అనుకొని,మా మరిది సాంబశివరావుని మా చిన్న అత్తయ్య చేతికి ఇచ్చి..’పోయిన బిడ్డని నేను తేలేను,కానీ..! ఆ బిడ్డ స్థానంలో నా బిడ్డను ఇస్తున్నాను పెంచుకో.’ అని అందంట బాధగా మరిది గారిని చూసి ఏడుస్తూ అత్తయ్య.

 

 

 

 

 

“ఎందుకు…? నీ కొడుకు నీ దగ్గరే పెట్టుకొని వాడికి అన్నీ తర్వాత చెప్పి,చివరి కాలంకి నన్ను ఒంటరిదాన్ని అనాధని చేయడానికా…!

 

” ఇప్పుడు అయినా నీ కొడుకు నీ దగ్గరే ఉంటున్నాడు,నాకు ఇచ్చిన రేపు నీ దగ్గరే ఉంటాడుగా..? అని అంది అంట పుల్లవిరుపుగా చిన్న అత్తయ్య.

 

 

“మా మామయ్యని బతిమిలాడి, చిన్న మామయ్యకి నచ్చచెప్పి శాంతి చనిపోయి కార్యక్రమాలు అన్ని పూర్తయ్యాక ఆస్తిని మొత్తం రెండు భాగాలుగా విభజించి,మా మరిది సాంబశివరావు గారిని మా చిన్న అత్తయ్యకి ఇచ్చేసి దూరంగా ఉందంట మా అత్తయ్య.

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue