“మీ గేటు పక్కన గోల్డ్ కలర్ లో శాంతినివాసం అనే నేమ్ ప్లేట్ ఉంది కదా.. అది చాలా బాగుంది,కానీ..! ఆ పేరు ఎందుకు పెట్టారు..?
“అంటే..! మీ పేరు కౌసల్య,మీ అమ్మాయి పేరు శైలు అంట,నాకు అను చెప్పింది. కానీ..! శాంతి ఎవరు..?” అని అడిగింది వేద.
“అది చాలా పెద్ద కదమ్మా.” అని అంది కౌసల్య.
“నాకు కథలు అంటే చాలా ఇంట్రెస్ట్ ఆంటీ, ఈరోజు అమ్మనే నన్ను పికప్ చేసుకుంటాను అంది,అమ్మ రావడానికి ఇంకా ఆఫేన్ అవర్ టైముంది. అనుది ఈరోజు క్లాస్ వర్క్ కూడా కంప్లీట్ అయింది,ప్లీజ్ చెప్పండి ఆంటీ.” అని ముద్దుగా బతిమిలాడింది వేద.