టకటక ఆ వర్కర్ నెంబర్ కూడా ట్రేస్ చేసి.. “సర్ వర్క్ కంప్లీట్.” అని అన్నాడు హెడ్.
“ఇప్పుడు ట్రేస్ చేసిన నెంబర్ కరెక్ట్ గా చూసి, ఈ రెండు సిగ్నల్స్ ఎంత డిస్టెన్స్ లో ఉన్నాయో చెప్పండి.” అని అన్నాడు వర్కర్ కి కాల్ కలుపుతూ శౌర్య.
“ఇప్పుడు మీరు ఇచ్చిన వర్కర్ నెంబర్ దానికి కొంచెం దూరంలో ఉంది సార్.” అని అన్నాడు హెడ్.
స్పీకర్ ఆన్ చేసి..”ఈ వర్కర్ నెంబర్ దశరథ్ పటేల్ పి ఏ నెంబర్ కి దగ్గరకి వెళ్లాలి అంటే ఎలాగో ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వండి సార్.’ అని హెడ్ దగ్గర ఫోన్ పెట్టి..’సార్ చెప్పిన వే లో వెళ్ళు.” అని అన్నాడు శౌర్య వర్కర్ తో ఫోన్లో.