New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
జ్వాల W/O శక్తి – 14

జ్వాల W/O శక్తి – 14

జేఎస్ కార్పొరేషన్ కేంద్ర కార్యాలయంలో వాతావరణం ఎంతో ప్రశాంతంగా ఉంది. శక్తి రెండవ అన్న ఆనంద్ వేర్‌హౌస్ మంటల్లో కాలి బూడిదై మూడు నెలలు గడిచాయి. జ్వాల ఇప్పుడు కేవలం భారతదేశానికే పరిమితం కాలేదు, ఆమె కన్ను అంతర్జాతీయ మార్కెట్ పై పడింది. వాళ్ళ కంపెనీ లీగల్ లాయర్  రఘు రామ్. అందించిన నివేదికల ప్రకారం, జేఎస్ గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్ట్ ఇప్పుడు ఐరోపా ఖండంలోకి విస్తరించడానికి సిద్ధంగా ఉంది. చైర్మన్ సీట్లో కూర్చున్న జ్వాల నుదుట గంభీరమైన బొట్టు, కళ్లల్లో  ఒక రకమైన  పొగరు గెలవగలను అనే నమ్మకంతో  టేబుల్ మీద ఉన్న   ఫైళ్లను పరిశీలిస్తోంది. ఆమె పక్కనే ఒక రక్షక కవచంలా విక్రమ్ నిలబడ్డాడు.

కానీ, ఈ ప్రశాంతత వెనుక ఒక పెద్ద తుఫాను దాగి ఉందని వారు ఊహించలేదు. ఆనంద్ లండన్ లో ఉన్నప్పుడు కేవలం హవాలా మాత్రమే చేయలేదు. వాడు అక్కడ ఉన్న అత్యంత ప్రమాదకరమైన అంతర్జాతీయ డ్రగ్ మాఫియా డాన్ ‘కార్లోస్’ దగ్గర దాదాపు ఐదు వందల కోట్ల రూపాయలు అప్పుగా తీసుకున్నాడు. జేఎస్ ఆస్తులను చూపిస్తూ ఆనంద్ ఆ ఒప్పందం చేసుకున్నాడు. ఇప్పుడు ఆనంద్ చనిపోవడంతో, కార్లోస్ కన్ను నేరుగా జేఎస్ కార్పొరేషన్ పై పడింది.

ఒకరోజు ఉదయం జ్వాల క్యాబిన్ లోకి ఒక అపరిచిత వ్యక్తి ప్రవేశించాడు. నల్లటి సూట్ వేసుకుని, విదేశీ యాసలో మాట్లాడుతున్న అతనిని చూడగానే విక్రమ్ అలెర్ట్ అయ్యాడు.

 

ఆ వ్యక్తి జ్వాల టేబుల్‌పై ఒక బాండ్ పేపర్ ఉంచాడు. “నమస్తే మేడమ్ జ్వాల. నా పేరు ఆండ్రూ. నేను లండన్ లోని కార్లోస్ గారి ప్రతినిధిని. మీ బావగారు ఆనంద్ మా దగ్గర తీసుకున్న ఐదు వందల కోట్ల అప్పుకు సంబంధించిన పత్రాలు ఇవి. ఒకవేళ వాడు చనిపోతే, ఆ అప్పును జేఎస్ కార్పొరేషన్ తీర్చాలి లేదా కంపెనీలోని 30 శాతం షేర్లను మా కార్లోస్ గ్రూప్ పేరు మీద రాయాలి. ఇది అంతర్జాతీయ లీగల్ నోటీస్” అని ఒక రకంగా క్రూరంగా  నవ్వాడు.

జ్వాల ఆ పత్రాలను ఒక్క క్షణం కూడా చూడకుండా, ఆండ్రూ కళ్లల్లోకి నేరుగా చూసింది. “ఆండ్రూ.. ఆనంద్ నా భర్తను చంపిన ద్రోహి. వాడు లండన్ లో ఏ పాపాలు చేశాడో, ఎవరి దగ్గర అప్పులు తీసుకున్నాడో నాకు తెలియదు నాకు అనవసరం కూడా. ఈ జేఎస్ కార్పొరేషన్ కేవలం నా భర్త శక్తి  కృషి, పట్టుదల , కష్టం ఉన్నాయి .ఇందులో  ఎటువంటి      ద్రోహుల అప్పులకు చోటు లేదు. నీ నోటీసులను పట్టుకుని లండన్ వెళ్లిపో.. లేదంటే ఇక్కడే బూడిదవుతావు” అని హెచ్చరించిది.

ఆండ్రూ ముఖంలో నవ్వు మాయమైంది. “జ్వాలా.. నువ్వు కార్లోస్ అంటే   ఎవరో తెలియక ఇలా మాట్లాడుతున్నావు. వాడు అనుకుంటే లండన్ లో కూర్చుని కూడా నీ సామ్రాజ్యాన్ని క్షణాల్లో కూల్చేయగలడు.  కాబట్టి  మర్యాదగా ఈ ఫైల్ పై సంతకం పెట్టు” అని హెచ్చరించాడు.

 

    విక్రమ్ ఆండ్రూ ను గొంతు పట్టుకుని    గాలిలోకి లేపాడు. “మేడమ్ ఆర్డర్ ఇచ్చారు కదా.. మర్యాదగా వెళ్తావా, లేక నిన్ను ముక్కలు చేసి లండన్ పార్సిల్ చేయమంటావా?” అని కోపంతో అన్నాడు. విక్రమ్ పట్టుకు ఆండ్రూ ఊపిరాడక విలవిలలాడాడు. విక్రమ్ అతనిని అలానే    తీసుకుని వెళ్ళి    క్యాబిన్ బయటకు విసిరేసాడు.

 

ఆ రాత్రి జ్వాల తన నివాసానికి చేరుకుంది. శక్తి జ్ఞాపకాలతో ఉన్న ఆ విల్లాలో ఆమె ఒంటరిగా కూర్చుని ఆలోచిస్తోంది. ప్రసాద్, ఆనంద్ లు పోయినా ఈ శత్రువుల పరంపర ఆగడం లేదు. అప్పుడే విక్రమ్ ఫోన్ చేశాడు. “మేడమ్.. కార్లోస్ మనుషులు మన లండన్ బ్రాంచ్ ఆఫీస్ పై దాడి చేశారు. అక్కడ ఉన్న మన ఎంప్లాయ్స్ ను బంధించారు. అంతేకాదు, రేపు ఉదయం జరగబోయే అంతర్జాతీయ గ్రీన్ ఎనర్జీ కాన్ఫరెన్స్ కు మీరు రాకుండా ఉండటానికి ఎయిర్‌పోర్ట్ దారిలో మిమ్మల్ని టార్గెట్ చేయబోతున్నారు” అని ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు.

జ్వాల సీటు నుండి లేచింది. ఆమె కళ్లల్లో భయం లేదు, ఒక సరికొత్త యుద్ధానికి సిద్ధమైన సింహిణి కనిపించింది. “విక్రమ్.. వాళ్లు నన్ను ఇండియాలోనే ఆపాలని చూస్తున్నారు. కానీ రేపు ఉదయం నేను లండన్ వెళ్లే ఫ్లైట్ ఎక్కడం ఖాయం. వాళ్ల వ్యూహానికి మన ప్రతివ్యూహం ఏంటో చూపిద్దాం. రేపు ఎయిర్‌పోర్ట్ దారిలో నేనే స్వయంగా కారు డ్రైవ్ చేస్తాను. నువ్వు బ్యాకప్ టీమ్‌తో సిద్ధంగా ఉండు” అని ఆదేశించింది.

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue