పాప ను సేఫ్ ప్లేస్ లో ఉంచి జ్వాల శేషావతారం దగ్గరకు నడుచుకుంటూ వెళ్లింది. వాడు నొప్పితో కింద పడి వెనక్కి దొర్లుతున్నాడు. జ్వాల వాడి కాలర్ పట్టుకుని గట్టిగా పైకి లేపి, ఫౌండేషన్ పిల్లల సాక్షిగా వాడి ముఖంపై వరుసగా పంచ్‌లు కొట్టింది. వాడి పళ్ళు రాలి రక్తం బయటకు వచ్చింది.
జేఎస్ ఫౌండేషన్ లోపల ఆడిటోరియం స్తంభానికి శేషావతారం గట్టిగా కట్టేసి ఉన్నాడు. ఒకప్పుడు ఇల్లీగల్ మాఫియాను, దారుణమైన కెమికల్స్ సప్లైని నడిపిస్తూ, ప్రమీల వెనుక ఉండి కోట్ల రూపాయల సుపారీ తీసుకున్న ఆ క్రూరమైన విలన్ ముఖం ఇప్పుడు భయంతో తెల్లబడిపోయింది. అతని శరీరం మొత్తం కొట్టిన దెబ్బలకు రక్తం ఓడుతోంది. అతని చుట్టూ అమర్చిన టైమర్ బాంబు డిజిటల్ స్క్రీన్ పై సెకన్లు కరిగిపోతున్నాయి.
జ్వాల నల్లటి కాంబాట్ డ్రెస్ లో, చేతిలో ఆటోమేటిక్ గన్ పట్టుకుని శేషావతారం ముందుకు నడిచింది. ఆమె వెనుక ఐదు వందల మంది అనాథ పిల్లలు భయంతో వణుకుతూ శారదమ్మ వెనుక దాక్కున్నారు.
“జ్వాలా.. అమ్మ.. నన్ను వదిలేయ్. ఆ ప్రమీల లండన్ నుండి నాకు వంద కోట్లు ఇస్తానని ఆశ చూపించింది. నీ గర్భాన్ని నాశనం చేయడానికి ఆ రోజు నా ల్యాబ్ లో తయారైన కెమికల్స్ నే ప్రమీల వాడుకుంది. శక్తి కారు కింద బాంబు పెట్టడానికి రుద్రప్పకు ఐడియా ఇచ్చింది కూడా నేనే. నా తప్పు నేను ఒప్పుకుంటాను, దయచేసి నన్ను పోలీసులకు అప్పగించు, అంతే కానీ ఈ బాంబుతో నన్ను చంపకు” అని శేషావతారం గట్టిగా అరుస్తూ ప్రాధేయపడ్డాడు.
జ్వాల అతని దగ్గరకు వెళ్లి గన్ బారెల్ ను నేరుగా అతని గొంతు కింద నొక్కింది. “శేషావతారం! నా భర్త శక్తిని కారులో పెట్టి కాల్చినప్పుడు నా భర్త కూడ ఇలాగే ప్రాణాల కోసం పోరాడాడు కదా? నా కడుపు పండకుండా, నన్ను అమ్మ అని పిలిచే భాగ్యం లేకుండా నా శరీరంలోకి మీరు విషం పంపినప్పుడు నీకు దయ రాలేదా? ఇప్పుడు కూడా నా పిల్లల ప్రాణాలను తీయడానికి బాంబులతో వస్తావా?” నీ ప్రాణం మీద కి వచ్చేసరికి వదిలెయ్యి అని వేడుకుంటున్నావా అని గర్జించింది.
బాంబు టైమర్ పై సమయం కేవలం 03:00 నిమిషాలు మాత్రమే చూపిస్తోంది. ఆ బాంబు మెయిన్ వైరింగ్ వ్యవస్థ చాలా కాంప్లికేటెడ్‌గా ఉంది.