New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
నా మావయ్య – 4

నా మావయ్య – 4

శివ వాళ్ళ స్నేహితులు తిట్టి పంపిస్తాడు 

 

ఇటు ఇంటికి వెళ్ళిన లక్ష్మీ కూతురు నగలు అని తీసి సదురుతుంది 

 

అమ్మ మావయ్య ఏంటి అప్పుడే వెళ్ళిపోయాడు 

కొంత సేపు కూడా లేకుండా కుసుమ వాళ్ళ అయిన అయితే తనతో రెండు రోజులు ఇక్కడే ఉన్నాడు నేను కూడా వెళ్ళి చూసి వొచ్చా మరి మావయ్య ఏంటి అసలు నాతో లేకుండా వెళ్ళిపోయాడు 

 

ఆ మాట కి శాంతి గారు మనవరాలి అలానే చూస్తారు 

 

అది రా చెప్ప గా మావయ్య కి పని ఉంది అని అందుకు వెళ్ళిపోయాడు వస్తాడు లే వోచిన తరువాత నిన్ను తీసుకొని వెళతాడు

 ఈలోపు నువ్వు అని పనులు నేర్చుకో అప్పుడే నన్ను మావయ్య కి బాగా 

నచుత్తావ్ 

 

సరే అమ్మ నేను అని నేర్చుకుంట మావయ్య నన్ను మెచ్చుకునేలా 

చేసుకుంటా 

 

సరే ఇప్పుడు పొడుకో అని చెప్పి బయటకి వచ్చి తల్లి దగ్గర కూర్చుంటుంది 

 

ఏంటి అమ్మ వాడు ఇలా చేసాడు 

 

వాడు చెప్పింది చేసాడు 

 

ఆ పిచ్చి దానికి ఏం చెప్పాలి అమ్మ

దానికి పెళ్ళి మావయ్య తో అని చెప్పి దగ్గర నుంచి నేను నా మావయ్య దగ్గరకు వెళ్తున్న ఇంకా రాను అందరికీ చెప్తుంది అమ్మ నువ్వు ఆయన వాడితో చెప్పు అమ్మ

 

ఏంటి చెప్పేది నేను తీసుకు రా అని అడిగితే 

ఇంటిలో నుంచి వెళ్ళిపోతా తరువాత నీ ఇష్టం నీ చావు నువ్వు చావు అని అన్నాడు మీ నాన్న ఎలానో పోయాడు ఈ వయస్సులో వాడు కూడా లేకపోతే 

నా పరిస్థితి ఏంటి అయిన వాడే వస్తాడు లే కంగారు పడకు సరే నా వేళ్ళు వెళ్ళి పొడుకో నువ్వు కూడా రా వస్తా లే అని కొంత సేపు కొడుకు గురించి ఆలోచించి వెళ్ళి పోసుకుంటుంది 

 

ఇటు శివ నైట్ అంత నిద్ర ఉండదు కన్ను మూస్తే కళ్యాణి నీ ఎత్తుకొని పెంచిన రోజులు తనని బండి మీద తిప్పిన రోజులు గుర్తు వస్తునాయి ఎందుకు మావయ్య నా జీవితం ఎలా చేశావ్ అని ఏడుస్తున్నట్టు ఉంది 

చా… నిజం గా నీ జీవితం నాశనం చేశా నే కానీ తప్పదు మీ.అమ్మ మా అమ్మ చేసిన దానికి నీకు బాధ తప్పదు 

 

 

అలా తేలవారుతుంది 

కళ్యాణి అమ్మ చెప్పినట్టు పని నేర్చుకోవాలి అని లేచి బయట కి వోచి

చీపురు పట్టుకుని ఊడవడం స్టార్ చెస్తుంది 

 

కళ్యాణి అటు ఇటు వెళ్ళే వాళ్ళు వింతగా చూస్తున్నారు 

అప్పుడే బయటకి వచ్చిన లక్ష్మీ అందరం అలా వింతగా చూడడం చూసి 

ఎవరిని చూస్తున్నారు అని చూస్తుంది కళ్యాణి ఊడుస్తూ కనిపిస్తుంది 

కళ్యాణి దగర కి వెళ్ళి చేతిలో చీపురు లాగుకొని ఇంటిలోకి తీసుకుపోతుంది 

 

 

ఏం అయ్యింది మా ఎందుకు నన్ను తీసుకొని వచ్చావ్ 

 

 

నిన్ను ఎవరు బయటకి వెళ్ళమని చెప్పారు 

 

 

ఎవరు ఎందుకు చెప్తారు మా నువ్వే గా పనులు అని నేర్చుకుంటే మావయ్య కి నచ్చుతుంది అని చేపావ్ అందుకే చేస్తున 

 

నేను చెప్ప వరకు నువ్వు బయటకి వెళ్ళకు

అర్థం అవుతుందా అని బయటకి వెళ్తుంది 

 

 

లక్ష్మీ నీ చూసిన ఒక ఆవిడ ఏంటి లక్ష్మీ నిన్న ఆగ పిల్లకి పెళ్ళి అయ్యింది అత్త ఇంటికి వెళ్లకుండా ఇక్కడే ఉంచుకున్నావ్ నీ తమ్ముడు వద్దు అన్నాడా ఏంటి అని నవ్వుతుంది 

 

అలా.ఏం లేదు పిన్ని మా. తమ్ముడు కి వేరే ఊరులో పని ఉంది అంట 

అందుకే కొని రోజులు నీ దగ్గర ఉంచుకొని పని నేర్పించు అక్క అన్నాడు 

నా. పిల్ల నాకు బరువు ఎంటా పిన్ని అందుకే నా దగ్గర ఉంచుకున్న

అని చెప్పి ఇంటిలో కి వెళ్తుంది 

 

ఇంటిలో అమ్మ ఎదురు గా ఉంటుంది 

ఇలాంటి సమాధానాలు చాలా రోజులు చాలా మందికి చెప్పాలి 

నేను ఇంటికి వెళ్తున్న అక్కడ వాడు ఒకడే ఉన్నాడు 

అని ఇంటికి బయలు దేరుతుంది 

 

 

ఇంటికి వెళ్ళే సరికి శివ ఇంకా పాడుకునే ఉంటాడు రాత్రి అంత తనకి సరిగా నిద్ర పట్టక ఎప్పటికో పోడుకుంటాడు శాంతి గారు శివ లేపకుండా ఆవిడ పని ఆవిడ చేసుకుంటూ ఉంటారు 

 

 

అలా ఎప్పటికో లేస్తాడు లేచి తన పనులు చేసుకొని 

పొలానికి వెళతాడు అక్కడికి వెళ్ళిన తరువాత పొలం లో.పని చేసే వాళ్ళు 

ఏంటి శివ బాబు నిన్ను ఎగా పెళ్ళి అయ్యింది అప్పుడే విచేసావ్ ఒక  పది రోజులు ఆగి రావాల్సింది అని పెద్ద ఆవిడ సిగ్గు పడుతు చెప్తుంది 

 

ఈ మాటకి మావయ్య రాని నవ్వు తెచ్చుకొని ముందు పని చూడు అని చెప్తాడు 

 

అటు గా వెళ్తున్న ఒక. పెద్ద అయిన ఏంటి శివ బాబు ఎవరికి చెప్పకుండా పెళ్ళి చేసుకున్నావ్  పెళ్ళి అయిన తరువాత రోజు విచేసావ్ అలిసిపోయి ఉంటావ్ గా విశ్రాంతి తీసుకోవాల్సింది అని నవ్వుతూ వెళ్ళిపోతాడు 

 

ఆ మాట కి అక్కడ ఉండలేక ఇంటికి వచ్చేస్తాడు 

 

 

ఇంకా ఉంది 

 

మీకు నచ్చితే ఫాలో చెయ్యండి కామెంట్ చేయండి ఫాలో అవండి