New Katha Varnika is now on Google Play — read Telugu stories on your phone. Learn more
నీ మనసు నాకు తెలుసు – 5

నీ మనసు నాకు తెలుసు – 5

నీ మనసు నాకు తెలుసు -5

 

 

సాయంత్రం నాలుగు గంటలకు…..

 

స్నేహ: చూడండి ఆంటీ… నేను దేవా తో మాట్లాడుదాము అని పిలిస్తే కొట్టి పంపాడు… అసలు, నేను అంటే ఇష్టం లేదు ఆయనకి… మీరు ఏమో పెళ్ళి అంటున్నారు…. నాకు దేవా అంటే ఇష్టం… కానీ, అతను నాతో క్లోజ్ గా ఉండాలి కదా… అలా ఉండాలి అంటే మీరే ఏదో ఒకటి చేయాలి కదా!!! దేవా తో నాకు పెళ్లి ఎంత తొందరగా వీలు అయితే అంత తొందరగా ఫిక్స్ చేసి ముహూర్తం పెట్టించండి……

 

 

శ్రీధర్: చూసావా, సునీత… నీ కొడుకు అమ్మాయిలు నీ కొట్టే రేంజ్ కి దిగజారి పోయాడు… అసలు, వాడికి బుద్ధి లేదు.. ఎవరితో ఎలా ప్రవర్తించాలి అని కూడా తెలియదు… వాడికి..

 

 

సునీత: నా కొడుకు ఏదో టెన్షన్ లో ఉండి… అలా చేసి ఉంటాడు లెండి… వాడు చాలా మంచి వాడు….

 

 

శ్రీధర్: అందుకే నా… ఇంటికి కూడా రాకుండా ఆ వంశీతో ఉంటున్నాడు???… ముందు ఆ వంశీ నీ ఉద్యోగం నుండి తీసేస్తే ఆ దేవా కి బుద్ధి వస్తుంది… కుక్క వెనక తోక ల ఎప్పుడూ ఆ వంశీ దేవా తోనే తిరుగుతూ వుంటాడు… 

 

 

స్నేహ: ఇది, అంత ఆపండి… ముందు నాకు దేవా కి పెళ్ళి చెయండి ఎలాగ అయినా…

 

 

శ్రీధర్: ఎలాగో, కంపెనీ లో మార్నింగ్ ఇంటర్వ్యూస్ జరిగాయి కదా.!!! స్నేహ కి కంపెనీ లో జాబ్ ఇప్పిస్తే…. అప్పుడు ఇద్దరు కలిసే ఉంటారు కదా… స్నేహ జాబ్ ఇప్పించక ఇంకా నువ్వే వాడిని పెళ్లి కి ఒప్పించాలి… వాడితో ఉంటూ…

 

 

ఒకే అంకుల్… నేను డైరెక్ట్ గా ఇంటర్వ్యూ కి వెళ్తే దేవా ఓపుకోడు… అది మీరు చెప్తే ఒకే అంటాడు అంకుల్…. ఇది మాంచి ఐడియా….

 

 

శ్రీధర్ కంపెనీ లో ఉన్న మేనేజర్ కి ఫోన్ చేస్తాడు…

 

 

 

సంజయ్: చెప్పండి సార్… ఏంటి కాల్ చేసారు???

 

 

శ్రీధర్: అదే, కంపెనీ లో ఇంటర్వ్యూస్ అయ్యాయి కదా… ఎవరు అయిన సెలెక్ట్ అయ్యారా??

 

 

 

సంజయ్: ఎస్, సార్ అయ్యారు. సెలెక్ట్ అయ్యారు… ఇంకా ఇంటర్వ్యూస్ క్లోజ్ చేశాము…

 

 

శ్రీధర్: ఎవరు సెలెక్ట్ అయ్యారు.?? ఆ అమ్మాయి నీ తీసేసి స్నేహని రిఫర్ చెయ్యి… 

 

 

సంజయ్: సారీ, సార్… అలా చేయలేము… ఒకవేళ ఆ సెలెక్ట్ అయినా అమ్మాయి… జాబ్ లో జాయిన్ అవ్వకపోతే.. అప్పుడు మళ్ళీ ఇంటర్వ్యూస్ చేసే ఆప్షన్స్ ఉన్నాయి… ఆర్ ఎల్స్ మీరు రిఫర్ చేసిన అమ్మాయి నీ పెట్టే ఛాన్స్ ఉంది సార్… ఒకసారి మీరు ఆ సెలెక్ట్ అయినా అమ్మాయి నీ కాంటాక్ట్ అయితే బెస్ట్ అనిపిస్తుంది…

 

 

శ్రీధర్: ఎవరు ఆ అమ్మాయి?? తన డీటెయిల్స్ మొత్తం కావాలి నాకు… వెంటనే పంపు…

 

 

సంజయ్: సారీ, సార్… అలా పంపడం కుదరదు… వన్స్ అగైన్ సారీ…..

 

 

శ్రీధర్: ఆ కంపెనీ నాది అన్న విషయం మర్చిపోయావా సంజయ్ నువ్వు???

 

 

సంజయ్: లేదు, సార్… కానీ,, దేవాన్ష్ సార్… ఆ అమ్మాయి డిటైల్స్ ఎవరికి ఇవ్వదు అన్నారు సార్… నన్ను క్షమించండి సార్… నేను తన డీటెయిల్స్ ఇవ్వలేను… మీకు…. అని చెప్పి ఫోన్ కట్ చేస్తాడు……

 

 

ఇలా కాదు అని అనుకోని…… స్నేహ వంశీ కి కాల్ చేస్తుంది…..

 

 

వంశీ: రేయ్, దేవా… స్నేహ నాకు కాల్ చేస్తుంది… సడన్ గా ఏంటి?? తను ఎప్పుడూ నాకు ఫోన్ చేయదు కదా….

 

 

అదా,, సంజయ్ కి ఫోన్ చేసి ఉంటారు… సీత గురించి అడిగి ఉంటారు….సంజయ్ ఏం చెప్పలేదు ఏమో.?? ఇంకా నిన్ను అడిగి కన్నుకోవడానికి నీకు ఫోన్ చేస్తుంది… అంటాడు దేవా….

 

 

వంశీ: నీకు ఎలా తెలుసు??? వాళ్ళు మేనేజర్ కి ఫోన్ చేసి కన్నుకుంటారు అని??…..

 

 

దేవా చెప్పడం మొదలు పెడతాడు… ఒక వన్ వీక్ బ్యాక్….

 

 

దేవా ఆఫీస్ లో వర్క్ చేసుకుంటూ ఉండగా… శ్రీధర్ క్యాబిన్ కి వస్తాడు…

 

 

శ్రీధర్: ఏరా దేవా!! ఇంటికి రావాలి అనిపించడం లేదు ఆ?? నీకు?? ఎలా ఉన్నావు?? బానే తింటున్నావ్ ఆ??

 

 

దేవా: ఏ పని మీద వచ్చారూ?? ముందు అది చెప్పండి.!! ఈ మధ్య మీకు అవసరం ఉంటే తప్ప నాతో మాట్లాడటానికి రావడం లేదు కదా..!!! మీరు???

 

 

శ్రీధర్: నేను నీకు తండ్రి నీ రా!! నేను పని మీదనే వస్తానా ఏంటి?? కొడుకు మీద ప్రేమ తో రాకూడదా???

 

 

దేవా: మరి అయితే,, నేను ఇంటి నుండి వెళ్ళి రెండు నెలలు అయింది… అప్పటి నుండి నాకు ఒక ఫోన్ కూడా చేయలేదు మీరు!! ఇప్పుడు సడెన్ గా వచ్చి మాట్లాడితే పని ఉండే వచ్చి ఉంటారు!!

 

 

శ్రీధర్: అవును, రా… పని మీదనే వచ్చాను… అయితే ఏంటి ఇప్పుడు?? నా ఫ్రెండ్ కూతురు ఉంది కదా…అదే, స్నేహ నీకు కాబోయే భార్య తను కూడా ఇక్కడ వర్క్ చేస్తా అంటుంది.. ఎలాగో ఇంకో వారం లో ఇంటర్వ్యూస్ అంట కదా… అవి కాన్సిల్ చేసి… స్నేహ నీ తీస్కో నేను చెప్తున్న….

 

 

దేవా: అది, కుదరదు నాన్న… అండ్ ఇంకో విషయం తను నాకు కాబోయే భార్య అని మీరు అనుకుంటే సరిపోదు నేను అనుకోవాలి అండర్స్టాండ్.??? తను ఎప్పటికీ నాకు వైఫ్ కాదు… అంతే… మీరు ఆ పని మీద వస్తె నేను మీకు ఏ సహాయం చేయలేను… మీరు ఇంకా వెళ్ళడమే మంచిది…

 

 

శ్రీధర్: సెలెక్ట్ అయినా వాళ్ళు…. ఎలా ఇక్కడ పని చేస్తారో నేను చూస్తా… 

 

 

దేవా: ఆల్ ది బెస్ట్……. 

 

 

 

To be continued……..