ఇంటికి చేరుకున్నాక శ్రీ కార్ ఆఫ్ చేసి సిరి వైపు చూసాడు. ఆమె చిన్నపిల్లలా ప్రశాంతంగా నిద్రపోతూ ఉండటం చూసి లేపాలనిపించలేదు. వెంటనే సీటును వెనక్కి జరిపి జాగ్రత్తగా ఆమెను చేతుల్లోకి ఎత్తుకున్నాడు. అలానే తన గదివైపు తీసుకెళ్తుండగా రాజేశ్వరి గారు కనిపించారు.
“ఏమైంది నాన్నా? సిరికి ఏమైంది?” అని ఆందోళనగా అడిగారు. దాంతో శ్రీ జరిగిన విషయం మొత్తం చెప్పాడు. అది విన్న రాజేశ్వరి గారి ముఖంలో కోపం స్పష్టంగా కనిపించింది. “ఒక ఆడపిల్ల జీవితం నాశనం చేసిన వాడు ఏం బాగుపడతాడు? నాకు తెలిసి ఆ అమ్మాయి కూడా వాడిని వదిలేసి వెళ్లిపోయినట్టుంది.
ఇప్పుడు మళ్లీ సిరి కావాలంటూ వచ్చాడు,” అని కోపంగా అన్నారు.శ్రీ మాత్రం నెమ్మదిగా, “ఇక వదిలేయమ్మా… సిరి ముందు ఈ విషయం మళ్లీ మాట్లాడొద్దు,” అని చెప్పాడు. ఆ తర్వాత మళ్లీ సిరి వైపు చూసి, ఆమెను ఇంకా జాగ్రత్తగా చేతుల్లో పట్టుకుని తన గదిలోకి తీసుకెళ్లిపోయాడు.
సిరి నీ జాగ్రత్తగా పట్టుకుని గదిలోకి తీసుకువెళ్లి బెడ్ పై పడుకోపెట్టాడు.
శ్రీ తర్వాత శ్రీ సిరి మొహమే చూస్తూ అలానే ఉండిపోతాడు.
ఎంత బాధ పడ్డావు నువ్వు ఆ క్షణం అంటూ అరుణ్ చేసిన దానికి చాలా కోపం తెచ్చుకుంటాడు.