పల్లెటూరి ఇల్లు కావడంతో అమ్మమ్మ వాళ్ళింటికి ఎవరు వచ్చారు ఎవరు వెళ్లారు.. ఆ గదిలోకి వెళ్లి అంత ధైర్యంగా బీరువా ఓపెన్ చేసి నగలు ఎవరు తీసుకున్నారు అనేది తెలియకుండా పోయింది…. అన్నాడు….
శ్రావణి అలాగే మౌనంగా ఉంటే అన్నట్టు ఎంత కాదనుకున్నా అది నీకు నాన్నమ్మ ఇల్లు కాబట్టి మీ వస్తువులన్నీ అక్కడే ఉంటాయి…. అత్త గదిలోకి అంత ధైర్యంగా వచ్చి స్వతంత్రంగా నగలు తీసుకునే అలవాటు ఎవరికి ఉంటుందో బాగా గుర్తు చేసుకో అన్నాడు వంశీ….
అత్తకు ఉంటుంది… కానీ తను ఎప్పుడు ఆ అధికారం చూపించాలని అనుకోలేదు…. సంయుక్త కి కూడా ఉంటుంది కానీ అది అమ్మకి నాకు చెప్పకుండా ఏది తీయదు… నాన్నమ్మకి ఉంటుంది కానీ నానమ్మ కూడా ఆ గదిలోకి వచ్చి నగలు తీయాలని అనుకోదు…
డాడీ కి ఉన్న అవి ఆడవాళ్ళకి సంబంధించినవి కాబట్టి అందులో అమ్మ చీరలు నా బట్టలు మా ఇద్దరి నగలు ఉంటాయి కాబట్టి నాన్న ఆ కబోర్డ్ దగ్గరికి ఎక్కువగా రారు…. పొలం పత్రాలు ఆస్తి పత్రాలు డబ్బు ఏదైనా పెట్టుకోవాలి అంటే ఆయనకి సపరేట్గా వేరే ఇనుప లాకర్ ఉందని చెప్పింది….
మనం మనం కాకుండా ఇంకెవరికి ఉంది అని అతను మళ్ళీ అడగడంతో బాగా ఆలోచించి కళ్ళు పెద్దవి చేసి పిన్నికి పిన్ని కూతురికి ఉంది అని చెప్పడంతో అత్త వాళ్ళ చెల్లెలికా అని వంశీకృష్ణ ఆలోచనలో పడడంతో అవును అంది….
అన్నట్టు చెప్పడం మర్చిపోయాను ఆ నగలు సంయుక్తకు చూపిస్తుంటే పిన్ని పిన్ని వాళ్ళ కూతురు కూడా అప్పుడే గదిలోకి వచ్చారు…. అయితే ఆ నగ పిన్ని తీసి ఉండొచ్చా అనగానే అత్త లాగా నువ్వు కూడా నిజాలు తెలియకుండా ముందే ఒక కంక్లూజన్ కి రాకపోవడమే మంచిది అన్నాడు…