ఎపిసోడ్ 25
పెళ్ళి గురించి, ప్రేమ గురించి ఎన్నో ఆశలు పెట్టుకుని, దాన్నొక స్వర్గంలా ఊహించిన తను
ఆ హోటల్ రూమ్ లొ వీడితో… ఛ..ఛ. అది తలుచుకుంటూ ఉంటే తన మీద తనకే కోపంగా, అసహ్యంగా ఉంది.
ఇన్ని రోజులు చీకటిలో వెతుకుతూ ఊహల్లో విహరిస్తూ ఉంది. ఇప్పుడు జరిగింది ఎలాగూ మార్చలేం.
ఇక జరగబోయే దాని గురించి ఆలోచించాలి.
రిజైన్ చేసి ఎటూ వెళ్ళలేని పరిస్థితి. దానికి ఇంకా ఆరు నెలల టైం ఉంది.
తరువాత తన దారి తనది అని మనసులో అనుకుంది స్వప్నిక.