ఎపిసోడ్ 27
ఆ పేపర్స్ ఓపెన్ చేసి చూసాడు విజె. ఒక్కసారి అతని కళ్ళు ఆ పేపర్ మీద అతుక్కుపోయాయి.
తనూ, స్వప్నిక ఇద్దరూ పక్కపక్కన నిలబడి ఉన్న ఫోటో అతని కంట పడింది.
ఆ ఫోటోలో ఆమె ఏదో చెబుతుంది, తను నవ్వుతూ వింటున్నాడు.
స్వప్నిక కొంచెం సిగ్గుపడుతూ ఉంది. ఎందుకంటె ఉదయమే తను ఆమెను ముద్దు పెట్టుకున్న విషయం ఇద్దరికీ గుర్తొచ్చి ఉంటుంది.
తన కళ్ళల్లో మెరుపు, ఆమె బుగ్గల్లో ఎరుపు కలిసి ఇద్దరు మేడ్ ఫర్ ఈచ్ అదర్ లా ఫోటో చాలా చక్కగా ఉంది.