పెళ్లి చూపులు -47
“ఇప్పుడు నువ్వు టీం లీడర్ పొజిషన్లో ఉన్నావ్, నిజానికి ఆ టీం లీడర్ పొజిషన్ నాకే రావాలి కానీ సిరికి ఇస్తాను అన్నారు. నాకు చాలా కోపం వచ్చింది తనకంటే ముందు వచ్చాను వర్క్ లో ఎఫిషియన్సీ ఉంది అయినా సరే నాకు ఇవ్వకుండా తనకి ఇస్తాను అనటంతో తన మీద ఇక నాకు పూర్తిస్థాయి కోపం పెరిగిపోయింది..
ఎలాగైనా తనని టీం లీడర్ పొజిషన్ నుంచి తప్పించాలి అని ట్రై చేశాను కానీ కుదరలేదు నువ్వు వచ్చావు నాకు చాలా హ్యాపీగా అనిపించింది. సిరికి టీం లీడర్ పొజిషన్ ఇవ్వలేదు అని, అంతేకాకుండా టీం లీడర్ గా వచ్చిన తర్వాత నువ్వు కూడా సిరి వెంట తిరుగుతూ ఉంటే నచ్చలేదు. ఎందుకో ఫస్ట్ టైం నిన్ను చూడగానే నచ్చేసావు” అని చెప్పి ఒక క్షణం ఆగింది గౌతమి..
వైష్ణవ్ మాత్రం గౌతమిని ఏమీ కదిలించకుండా ఆమె చెప్పే మాటలను వింటూ ఉన్నాడు..
నిన్ను చూసిన వెంటనే క్రష్ ఫీలింగ్ కలిగింది అని చెప్పవచ్చు అని చిన్నగా ఒక కన్ను మాత్రమే వైష్ణవ్ వైపు ఎత్తి చూస్తూ అన్నది.
అప్పటికి కూడా వైష్ణవ్ లో పెద్ద రియాక్షన్స్ ఏమీ లేకపోవటంతో చాలా నార్మల్గా రెండు కళ్ళతో వైష్ణవ్ ని చూస్తూ చెప్పటం మొదలుపెట్టింది.
నువ్వు సిరికి ప్రిఫరెన్స్ ఇస్తూ ఉండటంతో నాకు నచ్చలేదు. నేను వర్క్ డౌట్స్ అని నీ దగ్గరకు వచ్చినా కూడా నువ్వు నన్ను పెద్దగా పట్టించుకునే వాడివి కాదు.