New Katha Varnika is now on Google Play — read Telugu stories on your phone. Learn more
ప్రేమ(రెండు గుండెల చప్పుడు) – 17

ప్రేమ(రెండు గుండెల చప్పుడు) – 17

అలా ఆ రోజు అందరు తినేసి పడుకుంటారు అయిదు ఇంటికి అలా లేచి అందరు రెడీ అవుతుంటారు నివిత ని ప్రణతి రెడీ చేస్తుండగా నిత్విక్ రెడీ అవుతూ ఉంటాడు…

 

 

 

ఈ లోపు నివిత ని రెడీ చేసి నిత్విక్కి ఇచ్చిద్ది చూసుకోమని ప్రణతి రెడీ అవ్వడానికి వెళ్ళిద్ది ఇలా అందరు ఎవరికి వారు రెడీ అయ్యి వచ్చేలోపు అయిదున్నర అయ్యింది ఇంక అరవింద్ మంచి గా సూట్ అది వేసుకొని రెడీ అయ్యి కూర్చున్నాడు…. లేడీస్ అంత ఏమో వచ్చే వాళ్ళ కోసం అని స్నాక్స్ అవి రెడీ చేస్తున్నారు…. జెంట్స్ అంత అరవింద్ తో కూర్చుని ఎలా మాట్లాడాలి ఏమి చెప్పాలి అనేది అంత ప్రిపేర్ అయ్యావా అని అడుగుతూ ఉంటారు….

 

 

నా గురించి కూడా కొంచెం చెప్పు అని రిత్విక్ అంటూ ఉంటే ఈ లోపు నీవిత వాళ్ళ దగ్గరికి వచ్చి మా మామ నా గులించి కూడా చెప్తాడు బాగా కదా మామ అని ముద్దుగా అడుగుతూ ఉండిద్ది… అరవింద్ ఇంక నీవిత ని ఎత్తుకొని అలాగే బుజ్జితల్లి అని ముద్దు చేస్తూ ఉంటాడు….

 

 

ఇక్కడ ధాత్రి దగ్గర అయిదింటికి అల్లా ఇంటికి వెళ్ళిపోయింది జానకి గారికి రామ్ దేవ్ గారికి కూడా విషయం చెప్పింది వాళ్ళు ఎంతో సంతోషించి ధాత్రిని అంత ఆనందం గా చూసిన వాళ్ళు మురిసిపోతు మెటికలు విరిచి నువ్వెప్పుడూ ఇలాగే సంతోషంగా ఉండాలి తల్లి అని చెప్పి దగ్గరికి తీసుకొని నుదిటి మీద ముద్దు పెట్టుకుంటారు జానకి గారు…..ఈ లోపు దక్షిత్ కూడా వస్తాడు రాంగాల్నే నమస్తే బామ్మ గారు తాతయ్య అని కాళ్ళకి దండం పెట్టుకుంటాడు….

 

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue