అలా ఇంటర్వ్యూ చూస్తున్న ధాత్రి దక్షిత్ ప్రణతి ని చూడంగల్నే ఇది ఎలా సాధ్యం ఆ రోజు తను చనిపోయింది కదా మరి ఎలా అని ఆలోచిస్తున్నారు ఇద్దరు ధాత్రి కోపం తో అంటే ఆ రోజు ఇది చావలేదా బతికే ఉందా అని కోపం గా దక్షిత్ వైపు చూస్తూ అంటుంది….
కానీ దక్షిత్ చూపు మాత్రం జానకి రాందేవ్ గారి వైపు ఉంది అది గమనించిన ధాత్రి జానకి గారి వైపు చూసేసరికి వాళ్లిద్దరూ కోపం గా ఆశ్చర్యం గా చూస్తూ ఉండటం గమనించిన ధాత్రి జానకి గారి దగ్గరికి వెళ్లి కదిపిద్ది ఏమైంది బామ్మా ఎందుకు అంత కోపం గా చూస్తున్నావ్ ఏమైంది ఎవరిని చూస్తున్నావ్ అని అడిగింది….
ఆ మాటలకి జానకి గారు ధాత్రి వైపు చూస్తూ ఆ పార్వతి అక్కడ ఎందుకు ఉంది మీకు ఏమి అయ్యిద్ది అని అడిగింది దానికి ధాత్రి తనే మా అమ్మ పార్వతి అని చెప్పిద్ది…. ఇంక అంతే ఆ మాటకి రాందేవ్ గారు అంటే నువ్వు నువ్వు కేశవ్ కూతురివా అని అడుగుతారు…..
అప్పుడు ధాత్రి అవును తాతయ్య మా నాన్న పేరు కేశవ్ ఆయన ఒక జడ్జి అని మా అమ్మ లాయర్ అని చెప్పిద్ది…. ఆ మాటలకి ఆ దంపతులు ఇద్దరు ఆనందం తో అమ్మ ధాత్రి నువ్వు మా మానవరాలివే…. కేశవ్ ఎవరో కాదు అమ్మ మా కొడుకు అని చెప్తారు ఇద్దరు ఆనందం గా….