అక్కడున్న అందరికీ ఆ వాయిస్ కొత్తగా అండ్ గమ్మత్తుగా అనిపించేసరికి ,ఎవరిది ఈ వాయిస్, ఈ వాయిస్ ఇంతకుముందు ఎప్పుడూ వినలేదే అనుకుంటూ ఆ గొంతు వినిపించిన వైపు తలలు తిప్పి చూసారు.
ఆ గొంతు రిసెప్షన్ దగ్గర నుండి వినిపించేసరికి అందరు తలలు అటే టర్న్ చేయగా అక్కడ ఒక అమ్మాయి ఫుల్ మోడరన్ డ్రెస్స్ వేసుకుని నిలబడి ఉంటుంది..
అలా చూడగానే ఎవరు అబ్బా ఈ అమ్మాయి? ఇంత మోడరన్ డ్రెస్సులు వేసుకునే అమ్మాయిలు మాకు తెలియకుండా ఎవరున్నారు…గొంతు కూడా ఇంత స్వీట్ గా ఉంది…మన ఆఫీస్లో మనకి తెలియని ఈ మోడరన్ బ్యూటీ ఎవరు కొత్తగా అని ఆమె ఎవరో తెలుసుకోవాలి అనుకుంటారు…
బట్ వాళ్ళ బ్యాడ్ లక్ అనుకుంట. ఆ అమ్మాయి టోటల్ గా అటు వైపు తిరిగి ఉండడంతో వాళ్ళెవరికీ కూడా తన ఫేస్ కనిపించలేదు…
ఇవేమి పట్టించుకోని ఆ అమ్మాయి రిసెప్షనిస్ట్ తో దేని గురించో మాట్లాడుతు ఉంటుంది…
ఆ అమ్మాయి: ఎస్క్యూజ్ మీ…