సంజు ఆకాష్ ఇద్దరు లేట్ గా పడుకోవడం తో ఇద్దరు అలానే హత్తుకొని పడుకొనే ఉంటారు..
9 గంటలకి ఇద్దరికీ మెలకువ ఒకేసారి వస్తుంది ఆకాష్ సంజు ఒకరిని ఒకరు చూసుకుంటారు ఆకాష్ సంజుని చూసి నవ్వి ఒకసారి వాళ్ళు ఎలా ఉన్నారో చూసుకొని సంజు దూరం జరగడానికి ప్రయత్నిస్తుంది ఆకాష్ సంజు ని చూస్తూ నువ్వు ప్రతిసారి ఇలా భయపడకు సంజు నువ్వు నైట్ భయపడితే నేనే దగ్గరికి తీసుకుని పడుకోబెట్టుకున్నాను నాలో నీ మీద ఏ బ్యాడ్ ఇంటెన్షన్ లేదు అని సిన్సియర్ గా చెప్తాడు…
ఆకాష్ మాటల్లో నిజాయితీకి సంజు కూడా కూల్ అయ్యి మీరు సిన్సియర్ గా ఉన్న చూసే వాళ్ళు తప్పుగా అనుకుంటారు కదా ఆకాష్ గారు అందుకే దూరం జరుగుతున్నాను మీరు కూడా పెళ్లి చేసుకునే వారే కదా తనకి ఎవరైనా ఇలా ఒక అమ్మాయితో ఉన్నాడు అంటే తన మిమ్మల్ని బ్యాట్ గా అర్థం చేసుకుంటుంది అని నా ఒపీనియన్ అంటూ ఆకాష్ కి దూరం జరుగుతుంది సంజు…
సంజు నా లైఫ్ లో ప్రేమ పెళ్లి అనేది లేవని నేను అనుకున్నాను కానీ నా ఒపీనియన్ ఇప్పుడిప్పుడే చేంజ్ అవుతుంది అని చెప్తాడు ఆకాష్…