“ఈ క్షణం ఇప్పుడు… మీ స్పర్శ లేకపోతే నాకు నిద్ర రావడం లేదు.
మీ మాట వినకపోతే రోజు గడవడం లేదు.
మిమ్మల్ని చూడకుండా ఉదయం బెడ్ మీద నుంచి కూడా దిగాలనిపించడం లేదు.
ఈసారి మీరు నాకు దూరమైతే… నేను మాత్రం నిజంగా బ్రతకలేను సార్…”
అని గట్టిగా ఏడుస్తూ తన రెండు చేతుల్లో ముఖాన్ని దాచుకుంది.
సిరి మాటలు విన్న శ్రీ మనసు ఒక్కసారిగా కలిచివేయబడింది. ఇన్నాళ్లూ తన ప్రేమను ఆమె ఎంతగా అర్థం చేసుకుందో, తనపై ఎంతగా ఆధారపడుతుందో అతనికి తెలుసు. కానీ తనకు దూరమైతే బ్రతకలేనంతగా తనను ప్రేమిస్తోందని ఆమె నోటితో వింటుంటే అతని గుండె బరువెక్కిపోయింది.