నా మనసు దోచిన అతిధి {రాక్షస్ 🩶😈} – 2
నా మనసు దోచిన అతిధి రాక్షస్ [😈 🖤]
మోషన్ లో తిరిగా !!
మహా నటీ ఆ ఆ ఆ నా బ్యాగ్ రౌండ్ మ్యూజిక్
లోపలికి పదా అర్థరాత్రి ఏంటీ ఆటలు అంది
ఎస్ ఇంకో రెండు సార్లు అలాంటి డైలాగ్ లే కొట్టవే
వచ్చేస్తా లోపలే అనుకుని పైకి మాత్రం వద్దులే అక్క అమ్మ రమ్మనలేదంటే నేను వెళ్లి పోయినా తనకి పట్టదు కదా ఇన్నోసెన్స్ ఉరేసుకుంటదేమో నా ఎక్స్ప్రెషన్ చూసి
అయినా నన్ను పిలవని మా మాతాజీ ని చూసి నువ్వు అస్సలు తగ్గమాకు సాహి ఊరికే చిన్నపిల్ల
,అంటూ నీ వేల్యూ తేల్చేస్తున్నారు ఏదైనా తగ్గేదెలే ,
పుష్ప లో అర్జున్ ఎంత కరెక్ట్ గా చెప్పాడో తెలియదు గానీ నేను మాత్రం ఓ లెవెల్ కొట్టి చెప్పా
మా అమ్మ నా ఆశలమీద ఉప్పు నీళ్లు జల్లుతూ
పోతే పోవే అన్నట్టు నన్ను చూసి శాన్వి అదిపోతే పోనీ కానీ నీ కోసం చికెన్ పులావ్ చికెన్ పకోడా చేసాను వచ్చి తిందువు రా
మా అమ్మ నోటి నుంచి చికెన్ అని వినగానే నా నోట్లో లాలాజలం ఊరింది ఎందుకంటే నేను చికెన్ కి డై హాట్ ఫ్యాన్ మరీ
ఇంకేముందీ సిగ్గు శరం లోపలికి తొక్కి అమ్మా ఏదో సంవత్సరం తరువాత తప్పిపోతే తిరిగొస్తారే అలా పిలిచాను
చెప్పాలంటే మా ఇంట్లో హార్ట్ పేషంట్స్ లేరు కాబట్టి సరిపోయింది కానీ లేకుంటే నా నటన చూసి ఎప్పుడో గోవిందా
మా అమ్మ దొంగోన్ని పట్టే పోలీసోడి లా నన్నే అదోలా చూసింది
అవన్నీ మనకు పట్టవు లోపలనుండి నన్ను చికెన్ రా రమ్మని పిలుస్తోంది ఆగలేను అంటూ వెళ్ళే లోపు
ఏమే సాహి తిండికి ముఖం వాచిన దానిలా ఏంటే నీ కక్కుర్తి ఉదయమేగా మీ అత్త చేసిన చికెన్ మటన్ కలాయి అంటు కూడా మిగల్చకుండా ఊడ్చేసావ్
నా ఇన్నర్ గారు నన్ను ఏసుకుంటుంటే
హి హి అది ఉదయమే పిచ్చి మొద్దా నేను తిని ఓ ఫైవ్ అవర్స్ అవుతుంది సిగ్గు లేకుండా సెకలు పడ్డా
నా నెత్తి మీద మొట్టి కరువులో ఉన్నోడికి పచ్చి కాకరకాయ అయినా కమ్మగానే ఉంటదటా
అలా ఉంది నీ యవ్వారం దాని సెల్ఫ్ రెస్పెక్ట్ బాగా దెబ్బతినింది కాబోలు ఎలా వచ్చిందో అలాగే పోయింది లోపలికి మనం దాని ఫీలింగ్ అస్సలు లెక్క చేయకుండా
అంతేలే అమ్మ నీకు అక్క మీద ఉన్న ప్రేమ నువ్వంటే
పడిచచ్చే ఈ చిట్టి కూతురు మీద లేదు ఏడుపు రాకున్నా కళ్ళు తుడుచుకుని పెదవి విరిచా
చాలు కానీ వేశాలు రావే లోపలికి అమ్మ నవ్వుతుంది
లేని కాలర్ ఎగరేసి మరేం అనుకున్నావ్ సాహి అంటే
దెబ్బ కు అమ్మ ఐస్ ఫ్యాక్టరీ అయింది అట్లుంటది మనతో అని నాలో నేనే అనుకుని అక్క ను తోసుకుని ఆత్రం గా పోయా చికెన్ కోసమే నా ఆత్రమంతా
డాడీ దీన్ని యాక్టర్ ని చేసేస్తే ఎవర్నీ ఎదగనివ్వదు
దీని ఫర్మామెన్స్ చాలు వాళ్ళు నిలబడకుండా పోనీకి
నవ్వుతూ అంటున్న అక్క మాటలు నాకు వినబడుతూనే ఉన్నాయి
నేను కూడా అందంగా నవ్వేసి తినడానికి కూర్చో బోతే మా మాతాశ్రీ గారు పోయి స్నానం చేయవే
గబ్బుదానా అంది నా మొహం వాడిపోయింది ఒకసారి బౌల్ మీద ఉన్న మూతి తీసి చికెన్ స్మైల్ ఘాటుగా పీల్చి దానికే నోట్లో ఇంకొంచెం వాటర్
ఎక్కువయితే ఏడుపు ముఖం పెట్టుకొని పోయా నా రూం కి ఎంతయినా మా మాతాజీ సూపర్ ఉమెన్ తెలుసా నా రూం ఎప్పుడు నీటిగా ఉంచుతుంది
ఎక్కడివి అక్కడే ఉంటాయి మనం గబ్బ గబ్బు చేసినా మొత్తం సర్దుకుంటుంది తనే
కానీ ఎవరూ గుర్తించరు కదా ఇంట్లో ఉంటుంది ఏం పని సులువుగా మాట విసిరేస్తారు
నన్ను అడిగితే బయటన అయితే ఒకటే పని చేసుకుని వచ్చేస్తాం అది ఇంట్లో ఒక ఇంటి ఇల్లాలు తప్పా ఎవరూ గడ్డిపోచ అంటరూ
పైగా నీకేం పనుంది ఇంట్లో కూడా చెయ్యలేవా అని
వాళ్ళకేం తెలుస్తుంది ఇంటి పనులు చక్కబెట్టడం ఎంత కష్టమో ముందుగా తనే లేవాలి రూల్ మరీ
వాకిలి గుమ్మం ఊడ్చుకోవాలి మరి అందరూ బిజీ ఆయే తనేగా ఇంట్లో పడుండేది అందరికీ టి దగ్గర నుంచి టిఫిన్ లంచ్ డిన్నర్ కుక్ చేస్తూనే ఉండాలి
అలసట రాకూడదు మళ్ళీ వస్తే ఇంటిదగ్గర ఉండి నువ్వు అలసిపోతున్నావా ఆ మాటలు అనిపించుకో కూడదని ఎంత నీరసం కష్టం ఉన్నా ఓర్చుకుని
అన్నీ చేస్తుంది తనకి తనే అనేసుకుంటుంది ఇంట్లోనే గా ఉన్నాను నేను చెయ్యకపోతే ఎవరు చేస్తారు కష్టపడి వచ్చిన వాళ్ళను ఏమి అనకూడదు
సమయానికి అన్నీ సమకూర్చాలి అని మరి తను మనిషి కాదా నీకైనా ఓ పూట సెలవు ఉంటుంది మరీ తనకి ప్రతిరోజూ బండెడు చాకిరీ అయినా నోరెత్త కూడదు కిక్కురు మనకూడదు
గుర్తింపు లేని శ్రమ కదా తల్లులది !!??
కానీ మా నాన్న విషయం లో నేను సంతోషిస్తాను
ఎందుకంటే ఆయన అమ్మ కష్టాన్ని గుర్తిస్తారు గౌరవిస్తారు చాలు కదా తనకి
ఇదండీ నా చిన్న కుటుంబం చింతలేని కుటుంబం
తిడుతూనే ప్రేమ చూపించే అమ్మా
నేనేం చేసినా రైట్ మార్క్ మాత్రమే కొట్టే నాన్న
వీళ్ళకి అండగా ఉండే మా అక్క వీళ్ళని విసిగించి
వేసారి పోయేలా అల్లరి చేస్తూ అదే అల్లరితో ఆనందంగా ఉండే నేను
మీతో వాగి వాగి అలసిపోయా ఎనర్జీ కావాలి అంటే త్వరగా ఫ్రిజ్ లో కోలా తీసుకుని టీవీ ముందు సెటిల్ అయిపోయి చికెన్ ఐటమ్స్ ని ఓ పట్టు పడతాను
అదేంటో అందరూ తింటున్నప్పుడు కూల్ డ్రింక్ ఏంటి అంటారు మనకా అది లేనిదే ముద్దు దిగదాయే
అమ్మ గారు స్తోత్రాలు మొదలు సోఫా లో కూర్చుంటారా అలాగా ఎలా తయారయ్యావు ఇలా
అక్కడ కూడా ఇలాగే చేస్తూ నా తమ్ముడి ముందు మరదలి ముందు మా పరువు తీస్తున్నావా
అరుస్తూనే ఉంది నేను ఈలోపు తినేసి త్రేన్పులు కూడా అయ్యి టీవీ లో మంచి మూవీ వస్తే సెటిల్ అయ్యా
తిన్న కంచం కూడా కడగవా అక్కడా ఇంతేనా మా అమ్మ సుప్రభాతాలు ఆగవు నేను మారను అదంతే
కంటిన్యూస్💞
💗💗💗💗💗💗💗
Swipe left/right or tap the sides to turn pages