New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
ప్రేమ(రెండు గుండెల చప్పుడు) – 8

ప్రేమ(రెండు గుండెల చప్పుడు) – 8

హలో ఎవరు మాట్లాడేది అని అడుగుతాడు అరవింద్

అరవింద్ గొంతు గుర్తు పట్టిన ఆ ఆడ స్వరం వెంటనే ఫోన్ కట్ చేసి ఇదేంటీ వాడి ఫోన్ వీడి దగ్గరికి ఎలా వచ్చింది వీడు ఎక్కడ చచ్చాడు చ అనుకుంటూ అంటే అది ఇంక చావలేదా వాడికి అంత డబ్బు ఇచ్చి అంత మేనేజ్ చేసి కరెక్ట్ గా నేను అనుకున్న ప్లాన్ ఇంప్లిమెంట్ అయ్యేలా చూసుకొని పంపిస్తే తప్పించుకుందా అయినా అలా ఎలా తప్పించుకుంది అని టెన్షన్ పడుతు అటు ఇటు తిరుగుతూ ఉండిద్ది ఒక అమ్మాయి….

 

ఇక్కడ ఈ మాటలు అన్ని అనుమానం వచ్చి అంటే నిన్న మా అక్క విషయం ఎవరో కావాలని చేసారా ఆ అవసరం ఎవరికి ఉంది ఎవరిని అనుమానించాలి అసలు ఈ నెంబర్ ఎవరిది అనుకుంటూ ఎలాగ అయినా కనిపెట్టి తీరాలి అని చెప్పి ఒక అతనికి ఫోన్ చేసి రేయ్ హర్ష నీకు ఒక నెంబర్ ఇస్తాను అది ఎవరిదో ఏ ఏరియా నుంచి వచ్చిందో కొంచెం చూసి చెప్పవా అని అడుగుతాడు….

 

దానికి అతను సరే అని అరవింద్ చెప్పిన నెంబర్ సిస్టమ్ లో ఎంటర్ చేసి సెర్చ్ చేస్తాడు కాని అది అడ్రెస్స్ కాని నేమ్ కాని ఏమి తెలియదు దానితో అతనికి అర్ధం అయ్యిద్ది అది ఎవరో చాలా తెలివిగా ప్లాన్ చేసారు అని అదే విషయం అరవింద్ కి చెప్తాడు ఇది అంత తేలిక అయిన పని కాదు రా ఎవరో చాలా నీట్ గా ఎవరికి ఏ అనుమానం కూడా రాకుండ బాగా ప్లాన్డ్ గా ఉన్నారు అని చెప్తాడు….

 

ఆ మాటలకి అరవింద్ అసహనం గా ఇప్పుడు ఎలా రా కనుక్కోవడం కుదరదా అని కొంత బాధ కోపం కలగలిపిన గొంతు తో అంటాడు అసలు ఏమైంది రా ఎవరిది ఈ నెంబర్ అని అడుగుతాడు దానితో రాత్రి జరిగిన విషయం ఫోన్ దొరికిన విషయం ఆ కాల్ ఆడ స్వరం అన్ని చెప్తాడు అదంత విని అంటే అక్క మీద మర్డర్ అటెంప్ట్ జరిగిందా ఆ ఫోన్ అసలు మన గురించా లేక ఇంకావెరెవరో గురించి ఏమో అని అంటాడు…..

 

ఆ మాటలకి అరవింద్ లేదు రా ముందు నేను అదే అనుకున్న కాని నా వాయిస్ వినంగల్నే వెంటనే ఫోన్ పెట్టేసారు పైగా అది నాకు బాగా పరిచయం ఉన్న వాయిస్ లాగా ఉంది రా అని అంటాడు….

 

అవునా సరే నువ్వు రేపు ఒక చోటుకి రా ఆ ఫోన్ ని తీసుకొని ఏమైనా క్లూస్ దొరుకుతాయి ఏమో చూద్దాం అని అంటాడు సరే రా అని చెప్పి ఫోన్ పెట్టేసి దిగులుగా బెడ్ మీద పడుకుంటాడు అప్పుడే అరు అంటూ ప్రణతి లోపలికి వచ్చిద్ది తనని చూసి బాధ గా లేచి కూర్చుని రా అక్క అని చెప్పి పక్కకి జరుగుతాడు….

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue