శౌర్య బలవంతంతో అరణ్య్ తాగాలని నోటి దగ్గర పెట్టుకుంటున్న సమయంలో కాల్ వచ్చి పక్కకు వెళ్ళాడు…
వీళ్ళనే గమనిస్తున్న కైలాష్ అరణ్య్ కూడా తాగాడు అనుకోని.. శౌర్య ఒంటరిగా ఉండడం చూసి ఇద్దరమ్మాయిలని పంపిస్తాడు.. ఒకరు శౌర్య కోసం మరొకరు అరణ్య్ కోసం…
డ్రింక్ ఎఫెక్ట్ వల్ల శౌర్య లో వస్తున్న మార్పులు తనకి తెలుస్తున్నా.. ఒక అమ్మాయి వచ్చి రెస్ట్ రూమ్ కి వెళ్తుంటే కొంతమంది అల్లరి చేస్తున్నారని హెల్ప్ చేయమని అడగడం వల్ల.. పెద్ద పెద్ద పార్టీలలో అదంతా మామూలే కాబట్టి.. ఆ అమ్మాయి కూడా వెళ్లాడు శౌర్య..
రెస్ట్ రూమ్ లకి దగ్గరగా వచ్చేశాక ఇక్కడ ఎవరూ లేరుగా అని అడుగుతాడు సౌర్య..