రీషా షాక్ తో పక్కకి చూసే సరికి అర్చిత ఉండదు.. క్యామ్స్ లో చూస్తే తన బ్లాక్ లో వర్క్ చూసుకుంటుంది…
PA అంటే సాలరీ ఏం తక్కువ ఉండదు కానీ పార్ట్ టైం జాబ్ చేస్తుంది అనేసరికి ఎందుకో తన మీద పాజిటివ్ ఫీల్ వచ్చింది ఆ ముగ్గురికి..
రీషా వెళ్లి అర్చిత ని తీసుకొచ్చి… హేయ్ అర్చి.. వీళ్ళు నా ఫ్రెండ్స్ అరణ్య్ అండ్ శౌర్య అని పరిచయం చేస్తుంది…
హాయ్ సర్ అని చిన్న స్మైల్ ఇచ్చి వెళ్లిపోతుంటే.. హేయ్ ఆగు వాళ్ళకి నిన్ను పరిచయం చేయొద్దా అని చేతిని పట్టి ఆపేసి… తను అర్చిత.. ఇందాక నన్ను సేవ్ చేసింది.. ఇక నుండి నా బెస్ట్ ఫ్రెండ్.. మీరెంతో తను అంతే నాకు…. సో పుటేజ్ చూసారు గా.. సే థాంక్స్ టూ హర్ అని అంటుంది