సోనీ తప్పుడు పనులు చేస్తుందని అప్పటివరకు కోపం గా ఉన్న విన్నీ సోనీ ఎలాంటి పరిస్థితుల్లో ఆ పని చేస్తుందో అర్ధం అయ్యాక కూల్ అయ్యి సోనీ నీ అపార్థం చేసుకున్నందుకు బాధపడుతూ సోనీ నీ దగ్గరకి తీస్కుని ఓదారుస్స్తుంది…
విన్నీ తనని అర్ధం చేసుకున్నందుకు సోనీ సంతోషపడుతుంది…
నెక్స్ట్ సోని ఆ విషయం అమ్మతో చెప్పొద్దని, అమ్మకి తను అలాంటి పని చేస్తుందని తెలిస్తే చచ్చిపోతుందని విన్నీ దగ్గర మాట తీసుకుని ఇద్దరు ఎవరి ఇంటికి వాళ్ళు వెళ్ళిపోతారు…
విన్నీ ఎప్పటిలానే సోనీ తో క్లోజ్ గా ఉండేది….
అలా రోజులు గడుస్తున్నాయి… విక్కీ ఆగడాలు రోజు రోజుకి ఎక్కువ అవడంతో విన్నీ ఎలాగైనా విక్కీ కి బుద్ది చెప్పాలని గట్టిగా ఫిక్స్ అయి సరైన టైమ్ కోసం ఎదురు చూస్తుంటుంది…
.
అలా ఒకరోజు విన్నీ, సోనీ మాటల మధ్యలో విన్నీ విక్కీ గురించి, తను చేసే పనుల గురించి చెప్పి బాధ పడుతుంది…