రామాపురం నుంచి తిరిగి వచ్చిన రామ్మోహన్రావుగారు ఇంట్లోకి అడుగుపెట్టేసరికి సాయంత్రం అయింది. ప్రయాణం వల్ల కొంచెం అలసటగా ఉన్నా, మనసులో మాత్రం శేషయ్య జ్ఞాపకాలే తిరుగుతున్నాయి.
హాల్లో కూర్చుని టీవీ చూస్తున్న సావిత్రి భర్తను చూడగానే లేచి వచ్చింది.వచ్చేశారా ప్రయాణం ఎలా జరిగింది? హారికను కలిశారా
రామ్మోహన్రావుగారు సోఫాలో కూర్చుంటూ, కలిశాను సావిత్రి. ముందుగా శేషయ్య ఇంటికి వెళ్లాను. ఆ ఇల్లు చూసి చాలా బాధేసింది. ఒకప్పుడు ఎంత సందడిగా ఉండేదో! ఇప్పుడు పూర్తిగా పాడుబడి ఉంది. పక్కింటి వాళ్లను అడిగితే శేషయ్య చనిపోయిన తర్వాత హారికను మేనమామ రామయ్య తన ఇంటికి తీసుకెళ్లాడని చెప్పారు. అక్కడికి వెళ్లి కలిశాను అన్నారు.
మరి అమ్మాయి ఎలా ఉంది అని సావిత్రి ఆతృతగా అడిగింది.బాగానే ఉంది. చాలా పద్ధతిగా మాట్లాడుతుంది. శేషయ్య పోలికలు కూడా కనిపించాయి. వాళ్ల ఇంట్లో ఇప్పుడు హారిక పెళ్లి గురించి మాట్లాడుకుంటున్నారు.
పెళ్లా? అప్పుడే సంబంధం చూశారా ..
అవును. రాజేష్ అనే అబ్బాయితో సంబంధం కుదిరిందట. అబ్బాయి కూడా హారికతో మాట్లాడాడట. ఇద్దరికీ నచ్చడంతో ముహూర్తాలు పెట్టుకోవడానికి సిద్ధమవుతున్నారు.