భూమి నీ దీపం పెట్టీ రమ్మని చెప్తారు వైదేహి గారు….
భూమి వైదేహి గారి వైపు ఒకసారి చూసి దేవుడి గది లోకి వెళ్ళి దీపం వెలిగించి దేవుడిని తీక్షణంగా చూస్తూ…..
నా జీవితం తో ఇంకా ఎన్ని ఆటలు ఆడతావు…. అమ్మ నీ నాన్న నీ దూరం చేశావు…. ఇక వెధవని నా తండ్రి అనుకునేలా చేశావు… నన్ను లావుగా పుట్టించిన కూడా నిన్ను ఏనాడు నిందించలేదు నా రాత అంతే అని వదిలేశాను…
కానీ ఈరోజు నీ మీద నిజంగా కోపం వస్తుంది శివయ్య….
నేనేమి తప్పు చేశాను అని ఇన్ని బాధలు పడేలా చేశావు….
నేను అన్ని తప్పులు పాపాలు చేశానా…. ఇప్పుడు నాకు అతని తో ముడిపెట్టావూ…. ఆ ముడి జీవితాంతం ఉంటుంది అని నేను అనుకోను….