New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
మనసు చూడ తరమా 💗 – 4

మనసు చూడ తరమా 💗 – 4

ఆమెను మొదటి సారి చుసిన దృశ్యం మళ్ళీ కళ్ళ ముందుకు రాగానే ఒళ్ళు జలదరిస్తుంది అతనికి… 

 

వెంటనే ఆలోచనలన్నీ పక్కన పెట్టేసి ఆమెకు ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాడు పూర్తిగా డాక్టర్ గా మారిన అనిర్వాణ్…

 

రిపోర్ట్ లో బ్రెయిన్ ఫంక్షన్ అంతా బాగానే ఉన్నట్లు తెలుస్తుంటే… బ్లడ్ లాస్ తప్పా ఇంకా ఏం ప్రాబ్లెమ్ లేకపోవడం తో… గాయం మానే వరకూ రెస్ట్ తీసుకుంటే చాలు అనిపిస్తుంది… 

 

కానీ ఆమెకు ఎక్కించిన బ్లడ్ సరిపోదు ఆమెకు… ఇంకా ఎక్కిస్తే బెటర్… కానీ ఇప్పుడు అవైలబుల్ లేకపోవడం తో… ఆమె కోలుకోవడానికి గాయం మానడానికి చాలా టైమ్ పడుతుందని అనిపిస్తుంటే… ఆమె ను ఎలా తన వాళ్ళకి అప్పగించాలి అని ఆలోచనలో పడతాడు అనిర్వాణ్…  

 

కానీ అతనికి తెలియదు ఆమె ప్రాణాలకు ప్రమాదం ఆమె ఆరోగ్యం వలనో, ఆమెకు తగిలిన గాయం వలనో కాదని… బయట ఆమె కోసం మృత్యుదేవత లా ఎదురు చూస్తున్న ఒక నర రూప రాక్షసుడి వలన అని… 

 

ఆమె పరిగెడుతున్న సమయంలో ఆమె చేతిలో ఏమీ కనిపించదు అతనికి… ఫోన్ కూడా లేదు… ఎలా తన వాళ్లెవరో తెలుసుకోవాలని ఆలోచిస్తూ… ఆమె వాళ్ళ హాస్పిటల్ లో ఉన్నట్లు పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలనుకుంటాడు… తన వాళ్లకు ఆమె ఎక్కడుందో తెలుసుకోవడానికి లేదా మిస్సింగ్ కంప్లైంట్ ఇస్తే పోలీస్ లకు ముందే ఆమె గురించి ఇన్ఫర్మేషన్ ఉంటుంది కాబట్టి… వాళ్ళు ఆమెను చేరుకోవడం ఈజీ అవుతుందని…

 

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue