హాస్పిటల్ లో కళ్ళు తెరిచిన రౌడీ బాస్ తనకి డీల్ ఇచ్చిన బాస్ కి ఫోన్ కొట్టాడు.
పని అయిపోగానే ఫోన్ చెయ్ అన్న మాటకి అటు ఫోన్ ఆన్సర్ చేయడమే.. మ్మ్.. వాడు హాస్పటల్లో పడ్డాడా అని గాంబీర్యంగా అడిగిన ఆ గొంతుకి బెదురుతూనే హా.. పడ్డాడు సార్, కానీ మేము చెప్పినట్టు కాదు అని చెప్పడానికి ట్రై చేస్తున్నాడు..
అమౌంట్ ఫార్వర్డ్ చేస్తాను గుడ్ అని కాల్ కట్ చేసి బ్యాలెన్స్ 10 లక్షలు ట్రాన్స్ఫర్ చేశాడు.
ఓరి వీడి ఆత్రం కూల.. వీడెక్కడ దొరికాడురా మనకి, వాడు చెప్పేది తప్ప మనం చెప్పేది వినడు అని వచ్చి పడ్డ బ్యాలెన్స్ కి చంకలు గుద్దుకుంటూనే తల పట్టుకున్నాడు రౌడీ బాస్.