New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
మాంగళ్య బంధం – 31

మాంగళ్య బంధం – 31

ప్రతిమ ప్రణయ్ డీటెయిల్స్ ఎందుకు అడుగుతుందో ఏ మాత్రం ఐడియా లేని సీత మాత్రం ఆమె మాటలు నిజమే అని నమ్మేసి అంతేలే ఎంత ఒకేవూరు అయిన పెళ్ళి చేసుకోబోయే అబ్బాయి గురించి పెళ్ళి చేసుకోవాల్సిన అమ్మాయికి ఈ మాత్రం  తెలుసుకోవాలి అని. ఉంటుంది గా..

 

ఎం తెలుసుకోకుండా పెళ్ళి ఎలా చేసుకుంటారు.. ఇది  అతను గురించి ముందే తెలుసుకుని  అతనికి నచ్చినట్టు మారడానికి ట్రై చేయాలి అనుకుంటుందేమో తన కోరిక లో న్యాయం ఉందిగా అని అనుకుంటుంది మనసులో..

 

తాను అడిగిన డానికి సమాధానం చెప్పకుండా ఏటో చూస్తున్న సీత ని కదిపి ఏంటే నేను ఇక్కడ మాట్లాడుతుంటే నువ్వు ఏటో చూస్తు ఆలోచిస్తున్నావు..

 

 

ముందు నేను అడిగినదానికి సమాధానం చెప్పు.. ఆ అబ్బాయి మంచివాడా, చెడ్డవాడ అని మళ్ళీ అడిగింది..

 

మనసులో మాత్రం త్వరగా చెప్పవే బాబు టెన్షన్ తో చచ్చేలా వున్నాను.. వాడి గురించి ఒక్క నెగిటివ్ విషయం తెలిసిన  మా నాన్న గారి ముందు వాడిని అడ్డం గా బుక్ చేసి ఈ పెళ్ళి నుండి తప్పించుకోవాలి అని అనుకుంటూ ఉంటుంది..

 

ప్రణయ్ అన్నయ్య మంచివాడ అంటే ఏమోనే నాకు కూడా సరిగా తెలియదు అని చెప్తుంది సీత..

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue