మా బిడ్డ చిన్నతనంతో తెలిసి తెలియక ఏదైనా పొరపాటు చేసిన పెద్ద మనసుతో తనని మన్నించి మీ బిడ్డగా దగ్గరికి తీసుకుంటారని కోరుకుంటున్నాము అంటు భావోద్వేగంతో నిండిన గొంతుతో చెప్పి ఒకసారి ప్రతిమ ని ఇద్దరూ గుండెకి హత్తుకుంటారు…
ఆ సన్నివేశాన్ని చూసిన అక్కడ ఉన్న వాళ్ళందరి గుండె కూడా బరువు ఎక్కుతుంది..
ఆడవాళ్ళందరికీ ఒకప్పటి తమ అప్పగింతల శీను కళ్ళ ముందు మెదలగా, కూతురు ఉన్న తల్లిదండ్రులకి రేపు మాకు అలాంటి పరిస్థితి రాబోతుందని తలుచుకుంటేనే వాళ్ల మనసులు కూడా భారంగా మారుతాయి..
కాసేపు అక్కడ వాతావరణం , భారమైన మనసుల మధ్య,కళ్ళ నుంచి కారుతున్న కన్నీళ్ళ మధ్య గడిచిపోగా కూతుర్ని గట్టిగా హత్తుకుని తలనిమిరి ఆమె కన్నీటిని తుడిచి ఏడవకు బంగారం..
నువ్వేమీ మాకు కంటికి కనిపించినంత దూరంగా వెళ్లిపోవడం లేదు కదా.. నువ్వు మమ్మల్ని ఎప్పుడూ చూడాలి అనుకున్నా చూడొచ్చు..
మాతో ఎప్పుడు మాట్లాడాలి అనుకున్నా మాట్లాడొచ్చు.. ఒకే ఊరిలోనే ఉండబోతున్నాము.. ఒక్క నాలుగు వీధుల అవతల కి వెళ్తున్నావు అంతే ..