హైదరాబాద్లోని భూపతి విల్లాస్ లో ఉదయం పూట వాతావరణం చాలా ప్రశాంతంగా ఉన్నా, ఇషాంత్ రూమ్లో మాత్రం ఫైళ్ల హోరు సాగుతోంది.
పెదనాన్న రఘువీర భూపతి రాజు ఇచ్చిన పెళ్లి సంబంధం ఫైల్ని ఇషాంత్ క్షుణ్ణంగా పరిశీలించాడు. పెళ్లి కొడుకు పేరు సిద్ధార్థ్ వర్మ.
సిద్ధార్థ్ ఫ్యామిలీకి విదేశాల్లో భారీ బిజినెస్ నెట్వర్క్ ఉంది, అలాగే వైజాగ్లో కూడా వాళ్ళకి కొన్ని షిప్పింగ్ యార్డ్స్ ఉన్నాయి.
ఇషాంత్ తన పీఏ దిలీప్ని పిలిచి, సిద్ధార్థ్ గురించి నాకు పూర్తి రిపోర్ట్ కావాలి. అతని క్యారెక్టర్ ఎలా ఉంటుంది? బిజినెస్ డీల్స్ ఏంటి? అన్నీ తెలుసుకో అని ఆర్డర్ ఇచ్చాడు.
గంట తిరగకముందే రిపోర్ట్ వచ్చింది. అంతా పర్ఫెక్ట్. సిద్ధార్థ్ చాలా సంస్కారవంతుడు, తన అక్క తన్వికి సరైన జోడి అని ఇషాంత్ కి నమ్మకం కలిగింది.
వెంటనే హాల్లోకి వెళ్ళాడు. అక్కడ పెదనాన్న రఘువీర, పెద్దమ్మ దేవిక, తల్లి సుమిత్ర దేవి ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.