ఆ చీకటి కారిడార్లో కాలం ఆగిపోయినట్టు అనిపించింది. మైరా కొట్టిన చెంప దెబ్బ సౌండ్ ఆ గోడల మధ్య ఇంకా ప్రతిధ్వనిస్తూనే ఉంది.
ఇషాంత్ భూపతి రాజు.. భూపతి ఎంపైర్ వారసుడు.. తన జీవితంలో మొదటిసారి ఒక సామాన్య అమ్మాయి చేతిలో దెబ్బ తిన్నాడు.
అతని ముఖం పక్కకు తిరిగే ఉంది. మైరా చేతులు వణుకుతున్నాయి.
నేను ఏం చేశాను… అంతటి వాడిని కొట్టానా అని ఒకవైపు భయం, కానీ నా ఆత్మగౌరవాన్ని తాకినందుకు ఇది అతనికి తగిన బుద్ధి అని మరోవైపు ఆవేశం.
ఇషాంత్ మెల్లగా తన ముఖాన్ని మైరా వైపు తిప్పాడు. మైరా ఊహించినట్టు అతను అరుస్తాడని లేదా తిరిగి కొడతాడని అనుకుంది.
కానీ ఇషాంత్ ముఖంలో ఎటువంటి ఎమోషన్ లేదు. అతని కళ్లు ఎర్రగా మారాయి. ఆ చూపులో ఒక రకమైన క్రూరమైన నవ్వు ఉంది.