మీనాక్షి… నేను కాదు,, ఆమె…. – 5
మీనాక్షి…. నేను కాదు,,, ఆమె…. -5
At first my request is to all the readers pls try to give a review to my stories which helps me in improving…… and read my another stories as well. Arjun and ni manasu naku telusu…..let’s continue the story….
ఆదిత్య ఆ బెంచ్ నుండి లేసి… ఆ ముసలి ఆయన వెళ్ళిన వైపు వెళ్తాడు…. ఆ అమ్మాయి ఎవరు కనుక్కోవాలి…. ఆమె ఉంటే నా పని ఈసీ అవుతుంది కదా…..
సుందర్ మనసులో….. ఈరోజు వెళ్ళి కొంచం రెస్ట్ తీసుకుందాం అని కారు తీసి ఇంటికి వెళ్ళే దారిలో చిన్న ట్రాఫిక్ ఉండడం తో… రైల్వే స్టేషన్ వైపు నుండి వెళ్దాం అని అటు వైపు తిప్పుతాడు…. ఏంటో,, ఈరోజు ఎటు పక్కన వెళ్ళిన అంత ట్రాఫిక్ ఉంది అని అనుకుంటూ మెల్లగా డ్రైవ్ చేస్తున్నాడు….
ఆలోపు,,, ఒక అమ్మాయి కారు ఆపి… నన్ను అమ్మవారి టెంపుల్ దగ్గర డ్రాప్ చేస్తారా??? ప్లీజ్,, చాలా సేపు నుండి వెయిట్ చేస్తున్న అంటుంది….
సుందర్: సరే,, మేడమ్… ఎక్కండి డ్రాప్ చేస్తా…. అనగానే ఆ అమ్మాయి కారు ఎక్కి బ్యాగ్స్ పట్టుకొని కూర్చింది…. ఎంత దూరం అండి ఇక్కడ నుండి అమ్మవారి టెంపుల్….
సుందర్: ఒక 10 మినిట్స్ లో వెళ్ళిపోతాం మేడమ్ దగ్గరే… ట్రాఫిక్ లేకపోతే వెళ్ళిపోవచ్చు….
దానికి ఆ అమ్మాయి… సరే అండి అని చుట్టూ పక్కల మధురై అందాలు చూస్తుంది….
ఒక పది నిమిషాలు తరవాత…..
సుందర్: మేడమ్,,, టెంపుల్ దెగ్గరకు వెళ్ళదు ఇంకా… ఇక్కడే దిగండి….
ఆ సరే అండి…. ఎంత అయ్యింది…. అని అడుగుతుంది ఆ అమ్మాయి….
సుందర్ మనసులో ఏంటి ఈ అమ్మాయి నీ ఎక్కడో చూసినట్టు ఉంది… బాగా తెలిసిన అమ్మాయిల ఉంది ఏంటి?? అనుకుంటూ వుంటాడు….
హలో,, ఎంత ఇవ్వమంటారు?? అని ఆమె మళ్ళీ పిలుస్తుంది
సుందర్: ఆ హండ్రెడ్ అయింది మేడమ్…. మీ పేరు???
తీసుకోండి…. నా పేరు మీనాక్షి…. అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఆమె….
అసలు,, ఏం అయింది నాకు…. ఎందుకు ఈ అమ్మాయి నీ చూస్తూ ఉంటే బాగా తెలిసినట్టు ఉంది… బాగా పరిచయం ఉన్న అమ్మాయి లా ఉంది ఏంటి??? చూస్తూ ఉంటే చూడాలి అనిపిస్తుంది… తన పక్కన ఉండాలి అనిపిస్తుంది ఏంటి??? ఏమో లే ఈరోజు నాకే ఏదో అయినట్టు ఉంది… లేట్ గా లేచాను… అది కాకుండా గుడిలో ఏమో అలా… ఇప్పుడు ఏమో ఇలా…. ఇంటికి వెళ్ళి నిద్రపోతే కానీ సెట్ అవ్వదు…. అని అక్కడ నుండి వెళ్ళిపోతాడు సుందర్….
………………………….
మీనాక్షి అలా నడుచుకుంటూ ఫస్ట్ రూమ్ తీసుకొని ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళీ టెంపుల్ కి వెళ్దాం….. ఫైనల్లీ,, ఎన్ని డేస్ నుండి అనుకుంటున్న ఈ టెంపుల్ కి రావాలి అని….. ఇప్పుడు వచ్చ…. చాలా హ్యాపీ గా ఉంది నాకు…. ఇంతకీ ఆ కారు డ్రైవ్ చేసిన అతను నా పేరు అడిగితే చెప్ప… అతని పేరు అడగడం మర్చిపోయా ఏంటి??? అనుకుంటూ……
ఏంటో,, అతని చూస్తూ ఉంటే… బాగా తెల్సిన వాడి లాగా ఉన్నాడు…. పేరు అడిగి ఉంటే సరిపోయేది.. పోనీ,, లే,, ఎలాగో ఒక వారం ఇక్కడే ఉంటాం కదా…. ఆ లోపు తెలుసుకోవచ్చు లే…. ఇక్కడే డ్రైవ్ చేస్తూ ఉంటాడు…… అని అనుకోని ఫ్రెష్ అయ్యి వచ్చి…. టెంపుల్ కి వెళ్దాం అనుకునే లోపు… చీకటి పడింది…. సరే,, గుడికి రేపు వెళ్దాం అని అనుకోని…. తినడానికి బయటకి వెళ్తుంది…
మధురై లో సాంబార్ బాగుంటుంది అంట… ఫుల్ గా తినాలి…. అని అనుకుంటూ నడుచుకుంటూ వెళ్తుంది…..
…………………………..
జోసెఫ్: ఇక్కడ అనవసరం గా వచ్చాను అనుకుంటా…. అని అనుకుంటూ ఉండగా… అమీలియా నుండి ఫోన్ వచ్చింది….. కాల్ లిఫ్ట్ చేస్తాడు…
అమీలియా: జోసెఫ్,, ఎలా ఉన్నావ్?? తిన్నావా??? ఫోన్ కూడా చేయలేదు అంత బిజీగా ఉన్నావా?? 2 డేస్ అయింది ఫైన్ చేసి…
జోసెఫ్: సారీ,, కొంచం బిజీ…. వర్క్ లో పడి మర్చిపోయాను….
అమీలియా: ఒకే,, ఎప్పుడూ వస్తావు?? పెళ్ళి ఎప్పుడూ చేసుకుందాం….
జోసెఫ్: ఇంకా వర్క్ అవ్వలేదు…. అయ్యాక వెంటనే వచ్చేస్తాను….. డు యూ వాంట్ టూ సీ మధురై???
ఆ చూపించు…. నేను కూడా చూస్తాను అని వీడియో కాల్ లిఫ్ట్ చేస్తుంది….
అమీలియా: ఓహ్,,, చాలా బాగుంది…. నేను కూడా అక్కడకి రావాలి అనుకుంటున్న బట్ రాలేను… వాటెవర్… నువ్వు ఫాస్ట్ గా ఆ వర్క్ ఏదో చేసుకొని వచ్చేయి… మనం మళ్ళీ పెళ్లి అయ్యాక కలిసి వెళ్దాం…
జోసెఫ్: కచ్చితంగా…. ఓకే బాయ్… నేను తినడానికి వెళ్తున్న…. అని ఫోన్ కట్ చేస్తాడు….
To be continued……
Swipe left/right or tap the sides to turn pages